Nokia G21 స్మార్ట్‌ఫోన్.. 3 రోజుల బ్యాటరీ లైఫ్, మరెన్నో ఫీచర్లు!
ఇకప్పటి ఐకాన్ ఫోన్ బ్రాండ్ నోకియా నుంచి Nokia G21 పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. దీనితో పాటు మరో రెండు ఫీచర్ ఫోన్లను, ఇయర్ బడ్లను కంపెనీ విడుదల చేసింది.
నోకియా ఫోన్‌ల తయారీదారు HMD గ్లోబల్ తాజాగా 'Nokia G21' పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Nokia G21 స్మార్ట్‌ఫోన్ ర్యామ్ ఆధారంగా 4GB లేదా 6GB రెండు వేరియంట్‌లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మరి ఈ సరికొత్త Nokia G21లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Nokia G21 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
4GB/6GB RAM, 64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్
వెనకవైపు 50 మెగా పిక్సెల్ +2MP + 2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5050 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
4GB RAM +64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999/-
రెండవ వేరియంట్ 6GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.14,499/-
ఈ స్మార్ట్‌ఫోన్ డస్క్, నార్డిక్ బ్లూ.అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది.
Nokia G21తో పాటు, కంపెనీ రెండు కొత్తగా Nokia 105, Nokia 105 Plus అనే ఫీచర్ ఫోన్‌లను అలాగే Nokia Comfort Earbudsలను విడుదల చేసింది.
సంబంధిత కథనం