సరికొత్త NoiseFit Buzz స్మార్ట్‌వాచ్, ఇందులో ఆ ఫీచర్ హైలైట్!
సరికొత్త NoiseFit Buzz స్మార్ట్‌వాచ్ మార్కెట్లో విడుదలయింది. దీని ఫీచర్లు, ధర, ఇతర వివరాలు చూడండి..
ఇండియాలోని ప్రముఖ స్మార్ట్‌వాచ్ మేకర్ నాయిస్, తమ బ్రాండ్ నుంచి తాజాగా NoiseFit Buzz పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. అలాగే ఇది వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి చేస్తే 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత తదితర వివరాలను ఇక్కడ పొందుపరిచాం, పరిశీలించండి.
NoiseFit Buzz స్మార్ట్‌వాచ్‌లో 360x360 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 1.32-అంగుళాల TFT LCD డిస్‌ప్లే ఉంది. ఇందులోబి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా కాల్‌లు చేయడానికి అలాగే స్వీకరించడానికి యూజర్లకు అనుమతిస్తుంది. మెరుగైన ఆడియో కోసం నాణ్యమైన మైక్, స్పీకర్ ఇచ్చారు. NoiseFit Buzz వాయిస్ అసిస్టెంట్‌కి సపోర్ట్ చేస్తుంది.
హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ల పరంగా చూస్తే, 24x7 హృదయ స్పందన మానిటర్, స్త్రీ ఆరోగ్య ట్రాకర్, స్టెప్స్ కౌంటర్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్లు ఉన్నాయి. ఈ స్లీప్ ట్రాకర్ యూజర్ ఎలాంటి నిద్రపోయాడు.. గాఢమైన నిద్ర లేదా తేలికపాటి నిద్ర అనేది కూడా సూచిస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్ 9 స్పోర్ట్స్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు వివిధ యాప్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లను కూడా అందిస్తుంది.
అయితే NoiseFit Buzz స్మార్ట్‌వాచ్ 'జెట్ బ్లాక్' అనే ఒకే ఒక్క కలర్ ఆప్షన్లో లభిస్తుంది. దీని ధర రూ. 2,999/- గా నిర్ణయించారు. ఏప్రిల్ 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం