Twitter privacy policy | ట్విటర్ కఠిన నిబంధనలు .. ఆ పోస్ట్‌లు చేయడం కుదరదు!
Twitter సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. యూజర్లు ఇకపై ఇతరుల అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోల వంటివి షేర్ చేయడానికి వీల్లేదు. అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి ట్విట్టర్ ఆ పోస్ట్‌ను తొలగిస్తుంది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ (twitter) తన ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. వినియోగదారుల గోప్యతను పరిరక్షించేందుకు ట్విట్టర్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. యూజర్లు ఇకపై ఇతరుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోల వంటివి షేర్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి ట్విట్టర్ ఆ పోస్ట్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా వారి ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయడం కానీ లేదా ఉల్లంఘన తీవ్రతను బట్టి పర్మినెంట్‌గా తొలగించే చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రకటించింది. మరొకరి పోస్ట్‌ల వీడియోలను,చిత్రాలను షేర్ చేయాలంటే వారి అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని ట్విట్టర్ స్పష్టం చేసింది.
ట్విటర్‌లో రహస్యమైన అంశాలను షేర్ చేయకూడదనే అంశంపై కూడా ట్విట్టర్ క్లారిటీ ఇచ్చింది. అడ్రస్, మెడికల్ బిల్స్, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్, జీపీఎస్ లొకేషన్, గుర్తింపు కార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఇప్పటికే తెలిపిన ట్విట్టర్.. తాజాగా మరికొన్ని అంశాలను అందులో చేర్చింది.
చెక్ పెట్టేందుకే..
ట్విట్టర్‌లో ఇతరుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన పోస్ట్‌లు వారి అనుమతి లేకుండా షేర్ చేస్తుండడం పెరిగిపోతోంది. ముఖ్యంగా అమెరికాలోని బహిరంగ ప్రదేశాలలో ఫోటోలు తీసి వాటిని ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. గతంలో యూరోపియన్ దేశాల్లో కూడా ఇలాంటి వ్యవహారాలే జరుగుతుండేవి. దీంతో అక్కడ చట్టాలకు అణుగుణంగా ఫిర్యాదులు అందితే వెంటనే ఫొటోలు, వీడియోలను తొలగిస్తుండే వారు. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇలాంటి వ్వవహారాలు పెరిగిపోతుండడంతో వినియోదారుల గోప్యత (Privacy)ను కాపాడేందుకు వివిధ దేశాల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది.
సంబంధిత కథనం
టాపిక్