Monday Motivation : సమయాన్ని అర్హత గల వారికోసమే ఖర్చు చేయాలి
Monday Thoughts : డబ్బు విలువైనదే.. కానీ సమయం అంతకంటే విలువైనది. డబ్బులు ఖర్చు చేసినా తిరిగి సంపాదించొచ్చు. కానీ సమయాన్ని అర్హత లేనివారికోసం.. ఖర్చు చేస్తే.. మాత్రం కష్టం. తర్వాత లైఫ్ టైమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది.
మధురం.. మధురం.. ఈ సమయం.. ఇలాంటి మాటలు జీవితంలో కొన్నిసార్లు చాలామందే అనుకుంటారు. ప్రేమలో కావొచ్చు, లేదంటే.. ఇతర వ్యక్తులతో ఏదైనా రిలేషన్ లో ఉన్నప్పుడు కావొచ్చు.. ఆ సమయానికి మనల్ని మించిన తోపు లేడు అనిపిస్తాడు. కానీ ఆ సమయంలో మీతో ఉన్నవారు.. మీరు సమయాన్ని ఖర్చు చేసేందుకు అర్హులా కాదా అనే విషయంపై క్లారిటీగా ఉండాలి. లేదంటే సమయం గడిచిపోయాక తిరిగి రాదు.
ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి 'సమయం'. దాన్ని పదిలంగా, మధురంగా ఉపోయోగించుకోవాలి. ఎవరికి సమయాన్ని ఇవ్వాలనే విషయంపై స్పష్టతం ఉండాలి. ఎందుకంటే.. ఎన్ని కోట్లు పోసినా.. తిరిగి రానిది, సంపాదించుకోలేనిది 'సమయం'.
కొంతమంది జీవితంలో అర్హత లేనివారికి సమయాన్ని ఇస్తారు. కొంతకాలం తర్వాత.. ఆ విషయాన్ని గుర్తిస్తారు. ఆ సమయంలో ఇలా చేసి ఉంటే బాగుండేది.. వాళ్లతో అనవసరంగా టైమ్ వేస్ట్ చేశానే.. అని ఫీల్ అవుతుంటారు. కానీ అలా బాధపడినా.. ఆ సమయం మళ్లీ తిరిగి రాదు. గడియరంలో ప్రతి సెకను విలువైనదే. అందుకే ఎవరికి మన సమయాన్ని ఇస్తున్నామనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. మీరు ఖర్చు చేసే సమయానికి వారు అర్హులేనా.. కాదా అనే విషయంపై స్పష్టత ఉండాలి.
జీవితంలో మనతో ఎక్కువ ట్రావెల్ చేసే వారికి టైమ్ ఇస్తే.. అదో తృప్తి. కానీ ఎక్కువ మంది లాంగ్ రిలేషన్ షిప్ కంటే.. షార్ట్ రిలేషన్ పిప్ కు విలువ ఇచ్చి.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు. అదే అసలు సమస్య. షార్ట్ రిలేషన్ షిప్ అని ముందుగానే గ్రహిస్తే.. వాళ్లు దూరమైనప్పుడు బాధ కూడా తక్కువే ఉంటుంది. అందుకే ఎవరూ మీ సమయానికి అర్హులో వారికోసమే.. కాలాన్ని ఖర్చు చేయండి. సరైన సమయంలో చేయలేని పని.. జీవితానికి సరిపడా నష్టాన్ని కలిగిస్తుంది.
ఒక ఏడాది ఎంత విలువైనదో పరీక్షలో తప్పిన విద్యార్థిని అడుగు,
ఒక రోజు ఎంత విలువైనదో ఒకటో తేదీన జీతం రానివాడిని అడుగు,
ఒక గంట ఎంత విలువైనదో క్షణం ఒక యుగంగా గడిపే ప్రేమికుడిని అడుగు,
ఒక నిమిషం ఎంత విలువైనదో రైలు మిస్ అయిన ప్రయాణికుడిని అడుగు,
ఒక సెకను ఎంత విలువనైదో యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న వ్యక్తిని అడుగు
సంబంధిత కథనం