MINI Aceman EV । ఆకట్టుకుంటున్న మినీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్..!
బ్రిటీష్ కార్ మేకర్ MINI తమ మొట్టమొదటి ఎలక్ట్రికల్ కార్ Aceman కాన్సెప్టును పరిచయం చేసింది. రాబోయే రెండేళ్లలో ఈ కారును లాంచ్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రిటీష్ కార్ మేకర్, BMW అనుబంధ సంస్థ అయిన MINI తాజాగా ఏస్‌మ్యాన్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఇది 2024 చివరి నాటికి సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌గా మార్కెట్లోకి రాబోతుంది. ఈ సరికొత్త మినీ కాన్సెప్ట్ కార్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆగష్టు 23న జరిగే గ్లోబల్ అటో షోకేస్‌లో ఈ కారును ప్రదర్శించనున్నారు. తమ భవిష్యత్ మోడల్స్ కు ఈ కార్ డిజైన్ ఒక ప్రివ్యూలాగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. Aceman అనేది MINI బ్రాండ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ మోడల్ కార్.
MINI Aceman కాన్సెప్ట్ కారును బిఎమ్‌డబ్ల్యూ అలాగే చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న స్పాట్‌లైట్ ఆర్కిటెక్చర్ మీద రూపొందిస్తున్నారు. నెక్ట్స్ జెనరేషన్ ఎలక్ట్రిక్ మినీ హ్యాచ్‌బ్యాక్ కోసం 50- 50 జాయింట్ వెంచర్ కింద చైనాలో Mini EVలను ఉత్పత్తి చేయడానికి ఈ ఆటోమొబైల్ రెండు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.
MINI Aceman EV Car ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు
ఏస్‌మ్యాన్ కాన్సెప్ట్ కార్ కొన్ని క్లాసిక్ MINI డిజైన్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో భాగంగా చిన్నని ముందుభాగం, వెనక ఓవర్‌హాంగ్‌లు, వీల్ ఆర్చ్‌లు, డోర్‌లపై బ్లాక్-క్లాడింగ్‌తో సైడ్-ప్రొఫైల్‌ను కలిగి ఉంది. అయితే కొత్త మినీ మోడల్‌లలో క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌కు బదులుగా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంటుంది.
హెడ్‌ల్యాంప్‌లు కూడా సాధారణంగా మినీ కార్లలో కనిపించే గుండ్రని వాటిలా కాకుండా కొద్దిగా త్రిభుజాకారంగా LED అవుట్‌లైన్‌ను కలిగి ఉంది. షోల్డర్ లైన్, టెయిల్‌గేట్ స్పాయిలర్, గ్లాస్‌హౌస్ డిజైన్ అన్నీ ఏరోడైనమిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని చేశామని MINI పేర్కొంది.
ఇంటీరియర్ హైలైట్స్, పవర్ ట్రెయిన్
మినీ ఏస్‌మాన్ కాన్సెప్ట్ ఇంటీరియర్ పరిశీలిస్తే డ్యాష్ బోర్డుకు గుండ్రని OLED టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. దిగువన 5-కంట్రోల్ యూనిట్లతో టోగుల్ బార్ ఉంది. ఇందులో ఒకటి ట్రాన్స్‌మిషన్ షిఫ్టర్‌గా పనిచేస్తుంది, మరొకటి డ్రైవ్ మోడ్‌ల మార్చటానికి ఉపయోగపడుతుంది.
Acemanలో బ్యాటరీ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, నెక్ట్స్ జెన్ మినీ EV హ్యాచ్‌బ్యాక్ లలో 183hp కూపర్ ఉంటుంది. ఇది సుమారుగా 40kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది సుమారు 402km పరిధిని ఇస్తుంది.
సంబంధిత కథనం