maruti vitara నుండి Kia Seltos వరకు.. 27 kmపైగా మైలేజ్ ఇచ్చే SUV కార్లు ఇవే!-maruti vitara hyundai creta toyota hyryder kia seltos check which suv gives 27 97kmpl mileage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Maruti Vitara, Hyundai Creta, Toyota Hyryder, Kia Seltos: Check Which Suv Gives 27.97kmpl Mileage

maruti vitara నుండి Kia Seltos వరకు.. 27 kmపైగా మైలేజ్ ఇచ్చే SUV కార్లు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 05:39 PM IST

భారత ఆటో మెుబైల్ మార్కెట్‌లో SUV కార్ల హవా కొనసాగుతుంది. తాజాగా దేశీయ ఆటో మెుబైల్ దిగ్గజం మారుతి సుజుకీ గ్రాండ్‌ విటారా పేరుతో సరికొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఇదే ఫీచర్స్‌తో మరిన్ని కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటి మైలెజ్ కూడా 27kmపైగా ఉండనున్నట్లు తెలుస్తుంది

Maruti Vitara, Hyundai Creta, Toyota Hyryder, Kia Seltos
Maruti Vitara, Hyundai Creta, Toyota Hyryder, Kia Seltos

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ రోజురోజుకు తన పరిధిని విస్తరిస్తోంది. మార్కెట్లో SUV మోడల్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ కార్‌మేకర్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUVని విడుదల చేసి తన మార్కెట్-బేస్‌ను విస్తరించింది. మారుతి సుజుకి తన సరికొత్త గ్రాండ్ విటారాను రెండు పవర్‌ట్రైన్- 1.5l K సిరీస్ ఇంజన్‌తో స్మార్ట్ హైబ్రిడ్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్‌తో ఆవిష్కరించారు. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన గ్రాండ్ విటారా 27.97kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే విటారా వంటి సమానమైన ఫీచర్స్ మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ కార్లు మంచి మైలేజ్ సామర్థ్యంతో వినియోగదారులకు ఆకట్టుకుంటున్నాయి. గ్రాండ్ విటారాలా ఇవి కూడా కేవలం పెట్రోల్‌ ఆప్షన్ మాత్రమే కలిగి ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫీచర్స్ అన్ని ఒకేలా ఉన్నాయి. ఈ కారు ఇంజన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఈ విటారా మాదిరిగానే ఉన్నాయి. గ్రాండ్ విటారా లానే హైరైడర్ కూడా అదే ఇంధన సామర్థ్యంతో,మైలెజ్‌తో రానుంది. ఈ ఫిగర్‌లలో చిన్న మార్పుతో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు, టయోటా హైరిడర్ సంబంధించిన ఫీచర్స్‌ను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా ప్రారంభం నుండి భారత మార్కెట్‌లో తిరుగులేని సెగ్మెంట్ లీడర్‌గా ఉంది. క్రెటా 1.5-లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్, 1.4-లీటర్ టర్బోతో శక్తితో రన్ అవుతుంది. NA ఇంజిన్ 17 kmplతో ఉండగా.. టర్బో పెట్రోల్ ఇంజన్ 16.8 kmpl మైలేజీని కలిగి ఉంటుంది, ఇది NA ఇంజిన్ కంటే మరింత శక్తివంతమైన ఎక్కువ శక్తిని అందిస్తుంది.

కియా సెల్టోస్

కియా సెల్టోస్ మిడ్-సైజ్ SUVలో మంచి పోటీగా నిలిచింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 వాహనాల్లో ఇది ఒకటి. సెల్టోస్ రెండు పెట్రోల్ ఇంజన్‌లలో వస్తుంది- ఒకటి 1.5-లీటర్ NA, రెండోది 1.4-లీటర్ టర్బో క్రెటా. సహజ పవర్‌ట్రెయిన్ 16.5 kmplగా ఉండగా.. టర్బో ఇంజన్ 16.1 kmplను అందిస్తుంది.

స్కోడా కుషాక్

స్కోడా కుషాక్ ట్రిమ్‌ 16 నుండి 19 kmplను అందిస్తుంది. ఇది TSI 1, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 1-లీటర్ TSI 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌లో లభిస్తుంది, అలాగే 6-స్పీడ్ మాన్యువల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌లో లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్