mango sago kheer: సాయంత్రం వేళ.. చల్లటి మామిడి పండు సగ్గుబియ్యం పాయసం..-making cool desert for summer mango sago kheer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Sago Kheer: సాయంత్రం వేళ.. చల్లటి మామిడి పండు సగ్గుబియ్యం పాయసం..

mango sago kheer: సాయంత్రం వేళ.. చల్లటి మామిడి పండు సగ్గుబియ్యం పాయసం..

Koutik Pranaya Sree HT Telugu
May 14, 2023 04:44 PM IST

mango sago kheer: మామిడి పండు, సాబుదానా కలిపి చల్లటి పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. వేసవిలో సాయంత్రం పూట తినడానికి చాలా బాగుంటుందిది.

మామిడి పండు సగ్గుబియ్యం పాయసం
మామిడి పండు సగ్గుబియ్యం పాయసం (freepik)

సాయంత్రం పూట మామిడి పండుతో కమ్మని డెజర్ట్ చేసుకుని చూడండి. సగ్గుబియ్యం మామిడి పండు పాయసం అలాంటిదే. సాయంత్రం పూట చల్లటి స్నాక్ లాగా దీన్ని తినొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల మామిడి గుజ్జు

సగం కప్పు మామిడి పండు ముక్కలు

పావు కప్పు సాబుదానా

1 కప్పు చల్లని పాలు

1 కప్పు చల్లటి నీళ్లు

4 చెంచాల పంచదార

1 చెంచా నెయ్యి

1 చెంచా జీడిపప్పు

చిటికెడు యాలకుల పొడి

తయారీ విధానం:

  1. ముందుగా సాబుద్దానాను కడిగి ఒక కప్పు నీళ్లు పోసుకుని, 1 చెంచా నెయ్యి వేసుకని 3 విజిల్స్ వచ్చే వరకు కుకర్ లో ఉడికించుకోవాలి.
  2. సాబుద్దానా చల్లబడ్డాక పంచదార కలుపుకోవాలి. పంచదార కరిగే దాకా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పాలు పోసుకుని కలుపుకోవాలి. మామిడి గుజ్జు కూడా కలుపుకుని , యాలకుడి పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
  4. జీడిపప్పు వేయించుకుని ఈ పాయసంలో కలుపుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని మీద కొన్ని మామిడి పండు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు.

Whats_app_banner