Bank account for women: మహిళలకు పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఎందుకుండాలి? ఈ లాభాలన్నీ పొందొచ్చు-know why women should have personal bank account know benefits too ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bank Account For Women: మహిళలకు పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఎందుకుండాలి? ఈ లాభాలన్నీ పొందొచ్చు

Bank account for women: మహిళలకు పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఎందుకుండాలి? ఈ లాభాలన్నీ పొందొచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Sep 07, 2024 12:30 PM IST

Bank account for women: పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి భార్య జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం పరవాలేదు. కానీ ప్రతి మహిళకు ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దీనివల్ల ఆర్థిక స్వాతంత్య్రంతో పాటూ అనేక లాభాలు పొందొచ్చు. దీని గురించి మరిన్ని విషయాలు తెల్సుకోండి.

మహిళలకు బ్యాంక్ అకౌంట్ ఎందుకుండాలి?
మహిళలకు బ్యాంక్ అకౌంట్ ఎందుకుండాలి? (shutterstock)

ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, దేశంలో 35% మహిళల బ్యాంకు ఖాతాలు క్రియారహితంగా ఉన్నాయి. ఈ సంఖ్య మహిళలు పూర్తిగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ఓ కల వంటిదని చెబుతోంది.

చాలా మంది మహిళలు అనేక కారణాల వల్ల వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తుంది. కొందరు పిల్లలు పుట్టాక ఉద్యోగం కొనసాగించలేరు. అలాంటి వాళ్లు వాళ్లకున్న వ్యక్తిగత అకౌంట్లను వాడటమే మానేస్తారు. దాంతో ఆర్థిక స్వతంత్య్రాన్ని కోల్పోయినట్లే. మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే దాన్ని మీ పర్సనల్ అకౌంట్లో వేసుకోవడం చాలా మంచిది. 20, 30, 40 లేదా 50 సంవత్సరాల వయస్సులో ఉన్నా, మీరు వ్యక్తిగత బ్యాంకు ఖాతా వాడి, మీ స్వంత డబ్బును వాడటం, ఆదా చేయడం అలవాటు చేసుకోవాలి.

ప్రత్యేక పొదుపు ఖాతా ఎందుకు అవసరం?

మహిళలకు పర్సనల్ పొదుపు ఖాతా ఆర్థిక భద్రత, ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇస్తుంది. ప్రత్యేక పొదుపు ఖాతాను కలిగి ఉండటం వల్ల మహిళలు తమ డబ్బును సమర్థవంతంగా నిర్వహించడానికి, వారి ఖర్చులను పర్యవేక్షించడానికి, వారి పొదుపును, పెట్టుబడులను ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించుకునేలా కష్టపడటానికి సాయపడుతుంది. మహిళల పొదుపు ఖాతాలతో అనేక ప్రయోజనాలను ఉంటాయి.

ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు:

ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాల తాలూకు డబ్బులు, సబ్సిడీలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. వ్యక్తిగత ఖాతాను కలిగి ఉండటం వల్ల మహిళలు ఈ ప్రయోజనాలను నేరుగా పొందడానికి వీలుంటుంది. ఇది ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.

సురక్షిత పొదుపు:

వ్యక్తిగత బ్యాంకు ఖాతా మహిళలు వారి డబ్బును పొదుపు చేసుకోవడానికి సురక్షిత మార్గం. తమ భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బును వారే సులభంగా ఉపయోగించవచ్చు.

ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులు:

బ్యాంకు ఖాతా కలిగి ఉండటం వల్ల మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది. వారు తమ దగ్గరున్న డబ్బు పొదుపు చేసుకోడానికి , వారు అర్హులయ్యే కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం:

మహిళలు సొంతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బ్యాంకు ఖాతా ఉంటే వారు తమ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా ఉంటారు. ఇది వాళ్ల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.

మహిళ పొదుపు ఖాతాలు:

సాధారణ పొదుపు ఖాతాల కంటే మహిళల పొదుపు ఖాతాలు ఉత్తమమైనవి. మహిళల పొదుపు ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని బ్యాంకుల్లోనే ఈ సదుపాయం ఉంటుంది. అలాగే, కొన్ని బ్యాంకులు సాధారణ పొదుపు ఖాతాల కంటే అధిక వడ్డీ రేట్లతో ప్రత్యేక మహిళల పొదుపు ఖాతాలను అందిస్తున్నాయి.

అధిక వడ్డీ రేట్లు: మహిళల పొదుపు ఖాతాలకు సాధారణ పొదుపు ఖాతాల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. ఇది వారి పొదుపుపై ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించడానికి, ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవడానికి సహాయపడుతుంది.

వ్యక్తిగత సేవలు: మహిళల పొదుపు ఖాతాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి వ్యక్తిగత సేవలు ఎక్కువగా ఉంటాయి. ఈ సేవలు అకౌండ్ వాడకం సులభతరం చేస్తాయి.

క్యాష్ బ్యాక్ ఆఫర్లు: మహిళల పొదుపు ఖాతాల్లో కిరాణా, పెట్రోల్, ట్రావెల్ వంటి వివిధ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటాయి. ఇది రోజువారీ ఖర్చుల కోసం డబ్బును ఆదా చేయడానికి వారికి సహాయపడుతుంది.

బీమా ప్రయోజనాలు

మహిళల పొదుపు ఖాతాల్లో తరచుగా యాక్సిడెంటల్ డెత్, తీవ్ర అనారోగ్యం లాంటి వాటికి క ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రమాదాలు లేదా అత్యవసర వైద్య పరిస్థితుల సందర్భంలో ఇవి ఆర్థిక రక్షణ అందిస్తాయి.

Whats_app_banner