Shahi egg curry Recipe: షాహీ ఎగ్ కర్రీ రెసిపీ.. లంచ్‌లో అదుర్స్
షాహీ ఎగ్ కర్రీ రెసిపీ ఇక్కడ తెలుసుకోండి. మధ్యాహ్న భోజనంలోనైనా, రాత్రి పూట భోజనంలోనైనా ఇది రుచికరంగా ఉంటుంది.
షాహీ ఎగ్ కర్రీ రెసిపీ (Sbchavan, CC BY-SA 4.0 , via Wikimedia Commons)
ఎగ్స్ అనేక రకాలుగా వండుకోవచ్చు. అలాగే వీటిని అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో, రాత్రి భోజనంలో, అలాగే స్నాక్స్ రూపంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందువల్ల వీలైనన్ని ఎగ్ రెసిపీలు తెలుసుకుంటే మీరు, మీ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటారు.
షాహీ ఎగ్ కర్రీ రెసిపీ ఎలా చేయాలి?
షాహీ ఎగ్ కర్రీని మీరు చపాతీలోకి గానీ, పరాఠాలోకి గానీ, అన్నం లోకి గానీ, బిర్యానీలో గానీ లేదా పులావ్‌లో గానీ కలుపుకొని తినొచ్చు. లంచ్ అయినా, డిన్నర్ అయినా అదిరిపోతుంది.
షాహీ ఎగ్ కర్రీలోకి కావాల్సిన పదర్థాలు
- 4 ఉడికించిన గుడ్లు
- 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్
- 1 టేబుల్ స్పూన్ పెరుగు
- 2 టేబుల్ స్పూన్ల ఆయిల్
- 1 ఉల్లి గడ్డ
- 3 పచ్చి మిరపకాయలు
- 1 టీ స్పూన్ అల్లం
- 1 టీస్పూన్ కసూరీ మేథీ
- 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా
- 1 టీస్పూన్ ఉప్పు
- అర టీస్పూన్ గరమ్ మసాలా
- అర టీస్పూన్ కారప్పొడి
- కాస్త కొత్తిమీర
- ఐదారు వెల్లుల్లి రెబ్బలు
షాహీ ఎగ్ కర్రీ తయారీ విధానం
- ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి.
- స్టవ్ వెలిగించి పాన్ వేడెక్కాక వంట నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లంతో కూడిన పేస్ట్ ఇందులో వేసి వేగనివ్వాలి.
- పెరుగు, ఫ్రెష్ క్రీమ్ విస్క్ చేసి పాన్‌లో వేసి బాగా కలుపుకోవాలి
- కారప్పొడి, కసూరీ మేథీ, గరం మసాలా, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసుకోవాలి. ఉడికేందుకు ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇలా ఒక 12 నిమిషాల పాటు ఉడికించాలి.
- ఉడికించిన కోడిగుడ్లకు చిన్న రంద్రాల్లా చేసి ఇప్పుడు పాన్‌లోని మిశ్రమంలో వీటిని కలపాలి. మరో నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి.
- ఇప్పుడుచాట్ మసాలా వేసుకోవాలి. కొద్ది సేపటి తరువాత క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే. షాహీ ఎగ్ కర్రీ రెసిపీ రెడీ.
టాపిక్