Janhvi Kapoor: లంగా ఓణీకే అందం తెచ్చిన జాన్వీ కపూర్, ఆమె హాఫ్ శారీ లుక్‌ని డీకోడ్ చేసేద్దాం రండి
anhvi Kapoor: జాన్వీ కపూర్ దేవరా సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తోంది. త్వరలో ఆ సినిమా విడుదల కాబోతోంది. ఈలోపు జాన్వి అందమైన లంగా ఓణీలో దర్శనమిచ్చింది.
Janhvi Kapoor: శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ కు చిన్నప్పటినుంచి ఒక గుర్తింపు ఉంది. హీరోయిన్‌గా మారాక తన సొంత టాలెంట్‌తో ఆమె అభిమానులను సంపాదించుకుంది. దేవరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. దేవరాలో జూనియర్ ఎన్టీఆర్‌కు జతగా ఆమె నటించింది. త్వరలో ఆ సినిమా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా జాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. లంగా ఓణీలో అందంగా ముస్తాబై తెలుగులో మాట్లాడుతూ వైరల్ అయింది. నీలం రంగు లంగా వోణీలో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. లక్షల మంది హృదయాలను ఆమె కొల్లగొట్టింది. జాన్వీ డ్రెస్సింగ్ సెన్స్ అద్భుతమని ఈ నీలిరంగు హాఫ్ శారీ చూస్తే చెప్పేయచ్చు.
జాన్వి కపూర్ ఈ లంగా ఓణీని ప్రత్యేకంగా కుట్టించింది. ఫ్యాషన్ బ్రాండ్ ఇతర్హ్ వారు ఈ లంగా ఓణీని డిజైన్ చేశారు. నీలిరంగులో రెండు రకాల షేడ్స్‌ను ఉపయోగించి దీన్ని స్టిచ్ చేశారు. నీలిరంగు చీరపై స్పటికాల్లా మెరుపులు ఉండేట్టు జాగ్రత్త పడ్డారు. కుచ్చిళ్ళు ఉన్న రెడీమేడ్ స్కర్ట్ ను డిజైన్ చేశారు. సూర్య కాంతి కింద మెరిసే సముద్రపు నీరులాగా ఈ లంగా ఓణీ రంగు అద్భుతంగా ఉంది.
జాన్వి ఈ హాఫ్ శారీ కోసం పొట్టి చేతులు ఉన్న బ్లౌజు వేసుకుంది. దానిపై క్రిస్టల్ మెరుపులు ఎంతో అందాన్ని ఇస్తున్నాయి. ఒక చిన్న చిక్ డైమండ్ నెక్లెస్‌ను ధరించి పెద్ద పెద్ద జుంకాలతో, చేతికి గాజులతో ఆమె తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది.
ఇక మేకప్ విషయానికి వస్తే జాన్వి తన చీరకట్టుకు తగ్గట్టే సింపుల్ మేకప్‌తో కనిపించింది. నలుపు రంగు ఐలైనర్‌తో, బుగ్గలకు పింక్ షేడ్‌లో అందంగా ఉంది. న్యూడ్ కలర్ ఐషాడో వేసుకొని పెదవులకు గ్లాస్ టచ్ ని ఇచ్చింది. ఆమెను చూస్తే దక్షిణాది పిల్లలా కనిపించడం ఖాయం. ఈ లంగా ఓణీ చూసినవారు కచ్చితంగా ఈ ఈ స్టైల్‌ను ఫాలో అయిపోతారు. ఈ లంగా ఓణీలో జాన్వీ కపూర్ కళ్ళకింపుగా కనిపిస్తోంది. ఒకసారి మీరు చూసి ఆనందించండి.
టాపిక్