ITBP Recruitment 2022: సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా..
ITBP Recruitment 2022 : సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల కోసం ITBP దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ప్రమాణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ITBP Recruitment 2022 : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 18 సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, itbpolice.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ITBP సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) ఖాళీ 2022 వివరాలు
పోస్ట్: సబ్ ఇన్స్పెక్టర్ (SI-స్టాఫ్ నర్స్)
ఖాళీల సంఖ్య: 18
పే స్కేల్: 35400 – 1,12,400/- లెవెల్-6
కేటగిరీ వారీగా వివరాలు
UR: 11
ఎస్సీ: 01
ST: 02
OBC: 02
EWS: 02
మొత్తం: 18
ITBP రిక్రూట్‌మెంట్ 2022 అర్హత ప్రమాణాలు
అభ్యర్థి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్‌లో 10+2 ఇంటర్మీడియట్ పరీక్ష చేసి ఉండాలి. సెంట్రల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసిన జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
* వయోపరిమితి: 21 నుంచి 30 సంవత్సరాలు
* దరఖాస్తు రుసుము: పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
* Gen/OBC/EWS కోసం: 200/-
* SC/ST/మహిళలకు: రుసుము లేదు
* ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: ఆగస్టు 17, 2022
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2022
ITBP రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ
PET, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సంబంధిత కథనం