Parenting Tips: మీ పిల్లలు మొండిగా మారుతున్నారా? వారితో వ్యవహరించే తీరు తల్లిదండ్రులు తెలుసుకోవాలి
Parenting Tips: పిల్లలు పదేళ్ల వయసుకు వచ్చినప్పడి నుంచి మొండిగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు చెప్పిన విషయాలను వినేందుకు ఇష్టపడరు. తాము చెప్పిందే అందరూ వినాలన్నట్టు ప్రవర్తిస్తారు. పిల్లలు మొండితనం నేర్చుకున్నట్లయితే, దానిని కొన్ని మార్గాల్లో అదుపుచేయాలి.
పిల్లలు పెరిగేకొద్దీ, వారు ఇంటికి బయట ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం మొదలుపెడతారు. వీరి మనసు బయట స్నేహితులతోనే ఎక్కువగా ఉంటుంది. చదువుపై దృష్టి తగ్గుతుంది. అదే సమయంలో డబ్బు ఖర్చు చేయడం నేర్చుకుని తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్టపడరు. బయటి ప్రపంచానికి మరింత ఆకర్షితులై ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా వారు మొండిగా తయారవుతారు. ఇలాంటి సమయంలో వారిపై మరింత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. పిల్లలు పెరిగే కొద్దీ మొండిగా మారడం ప్రారంభిస్తారు. కాబట్టి పిల్లలను హ్యాండిల్ చేయడం ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవడం చాలా అవసరం.
ఇలాంటివి ప్రోత్సహించకండి
పిల్లల ఏదో ఒకటి డిమాండ్ చేస్తూనే ఉంటారు. అన్నింటికీ మీరు ఒప్పుకోవాలని అతను భావిస్తాడు. మీరు అలా చేయకపోతే ఏడుపు ప్రారంభిస్తారు. అయినా మీరు కరగకుండా ఉండాలి. కోపం కూడా తెచ్చుకోకూడదు. పట్టించుకోకుండా ఉండండి. వారు ఏడవగానే మీరు ఓదార్చడానికి వెళితే వారు మరింత మొండిగా తయారవుతారు.
స్వేచ్ఛ కూడా అవసరం
ప్రతి విషయంలోనూ బిడ్డకు నో చెప్పడం వల్ల అతని మనస్సులో తల్లిదండ్రుల పట్ల ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో, కొంత స్వేచ్ఛ ఇవ్వడం కూడా అవసరం. స్నేహితులతో ఆడుకోవడం, మాట్లాడటం, తిరగడానికి అనుమతి ఇవ్వడం వంటివి. అయితే అదే సమయంలో పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం కూడా చాలా ముఖ్యం.
అన్నింటికీ తిట్టకండి
పిల్లవాడు వచ్చి తన తప్పును అంగీకరిస్తే తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. అతన్ని తిట్టడానికి బదులు, ప్రశాంతంగా వినండి. ఆ సమయంలో వారికి ఓదార్పు మాత్రమే ఇవండి. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలని వారికి వివరించండి.
పిల్లలతో వాదించకండి
పిల్లలు వాదిస్తున్నప్పుడు మీరు తిరిగి వాదించకండి. అలా చేస్తే వాదించడం మంచి పద్దతేమో అని ప్రతి చోటా అదే పని చేస్తాడు. కాబట్టి పిల్లల మాటల్లో కొన్నింటికే స్పందించండి. ఇది పిల్లవాడు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది.
ఏడుపుకు లొంగకండి
పిల్లవాడు ఏడుస్తూ, అరుస్తూ, ప్రతి విషయంలో మీతో వాదిస్తుంటే అతడిని ఎక్కువగా పట్టించుకోకండి. లేకుంటే అలాంటి డ్రామాలు ఎక్కువైపోతాయి. నిరంతరం పిల్లలను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఈ వయసులోనే పిల్లల్ని సరైన దారిలో పెట్టాలి. అతనికి పద్ధతులను నేర్పించాలి.
పనిష్మెంట్ వద్దు
ప్రతి తప్పుకు పిల్లవాడిని శిక్షించవద్దు. బదులుగా, అతనికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. ఇది పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. అతను తనను తాను మరింత మెరుగ్గా వ్యక్తీకరించగలుగుతాడు. ఉదాహరణకు, పిల్లవాడు దేనికైనా అనుమతి అడుగుతున్నట్లయితే, తన మాటలతో తల్లిని ఒప్పించమని చెప్పండి. అటువంటి పరిస్థితిలో, పిల్లలు తమను తాము మరిన్ని విధాలుగా వ్యక్తీకరించడం నేర్చుకుంటారు.
టాపిక్