Mood Disorder: ఆ క్షణమే కోపం, మరుక్షణమే ప్రేమ, ఇలాంటి మూడ్ డిజార్డర్లకు కారణం ఆ విటమిన్ లోపించడమే
Mood Disorder: మానసిక స్థితి, మెదడు పనితీరుకు.. మెదడులోని రసాయనాలు ఉత్పత్తి కావడం చాలా ముఖ్యం. మెదడు అభివృద్ధి కావాలంటే పోషకాలు సరైన స్థాయిలో అందుతూ ఉండాలి.
Mood Disorder: ఆ క్షణమే కోపం, మరుక్షణమే ప్రేమ, ఆ తర్వాత నవ్వు... ఇలా కొందరు నిమిషంలోనే రకరకాలుగా మారుతూ ఉంటారు. ఇదే మూడ్ డిజార్డర్. అంటే వారి శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల వచ్చే ఒక మానసిక వ్యాధి. ముఖ్యంగా మెదడు పనితీరును ప్రభావితం చేసేలా పోషకాహార లోపం ఏర్పడితే ఇలాంటి మూడ్ డిజార్డర్లు వస్తాయి. మానసిక స్థితి, మెదడు పనితీరుకు మెదడులోని రసాయనాలు సరైన స్థాయిలో ఉత్పత్తి కావడం చాలా ముఖ్యం. అలా ఆ రసాయనాలు ఉత్పత్తి కావడానికి విటమిన్ బి12 కీలకపాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే కోబాలమిన్ అని పిలిచే విటమిన్ బి12 లోపిస్తుందో మూడ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ బి12 లోపం లక్షణాలు
మన శరీరంలో అత్యాసరమైన పోషకం విటమిన్ బి12. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి, కణాల జీవక్రియకు, నరాల పనితీరుకు, డిఎన్ఏ ఉత్పత్తికి కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే కొన్ని విచిత్రమైన లక్షణాలు, అనుభూతులు కలుగుతాయి. చేతులు, కాళ్లలో జలదరింపులు, తిమ్మిరి వంటివి వస్తాయి. నడవడానికి ఇబ్బంది పడతారు. సమతులంగా నడవలేరు. రక్తహీనత కనిపిస్తుంది. ఆలోచించడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. తార్కికంగా ఆలోచించలేరు. బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. విటమిన్ బి12 లోపం అనేది మానసిక స్థితిని దిగజారుస్తుంది.
విటమిన్ బి12 తో పాటు ఇతర బి విటమిన్లు కూడా మానసిక స్థితికి అత్యవసరమైనవి. ఇవి మెదడు పనితీరును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. విటమిన్ బి12 తక్కువగా ఉన్నా లేదా విటమిన్ b6 తక్కువగా ఉన్నా... అది డిప్రెషన్ బారిన పడే అవకాశాన్ని పెంచుతుంది. మానసిక స్థితి నియంత్రణలో ఉండాలంటే మెదడుకు తగినంత విటమిన్ బి12 అందాల్సి వస్తుంది. విటమిన్ బి12 కోసం లీన్ ప్రోటీన్ ఉన్న కోడి మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను అధికంగా తినాలి. ఈ లోపం మరీ అధికంగా ఉంటే సప్లిమెంట్లుగా, ఇంజక్షన్లుగా కూడా ఇస్తారు.
విటమిన్ బి12 లోపల ఎవరిలో ఎక్కువ?
శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం అధికంగా కనిపిస్తుంది. అలాగే వృద్ధుల్లో కూడా పోషకాల శోషణ తక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో కూడా విటమిన్ బి12 లోపించే అవకాశం ఉంది. సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలను ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైనది. ఇది మానసిక స్థితిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే విటమిన్ బి12 స్థాయిలు తగ్గుతాయో... అప్పుడు హార్మోన్లల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మానసిక కల్లోలానికి, కోపానికి, నిరాశకు, చిరాకుకు దారితీస్తుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో విటమిన్ బి12 అధికంగా ఉండేలా చూసుకోండి. విటమిన్ బి12 లోపం అనేది పురుషులు, మహిళలే ఇద్దరిలో కూడా మూడు డిజార్డర్లను తీసుకొస్తుంది.
ఇప్పటికే చేసిన ఎన్నో అధ్యయనాల్లో విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ మధ్య అనుబంధాన్ని కనుగొన్నారు. ఎప్పుడైతే విటమిన్ బి12 శరీరంలో తగిన స్థాయిలో ఉంటుందో, వారి మానసిక స్థితి మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. విటమిన్ బి12 లోపం ఉందో లేదో తెలుసుకోవాలంటే వైద్యున్ని కలిసి తగిన రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
నరాల బలహీనతతో బాధపడేవారు లేదా మానసికంగా కుంగిపోతున్న వారిలో విటమిన్ బి12 లోపం ఉన్నట్టు గుర్తించవచ్చు. విటమిన్ b12 సరైన స్థాయిలో శరీరానికి అందడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటివి కూడా ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ధూమపానం, మద్యపానం వంటివి మానేయాల్సిన అవసరం ఉంది. శారీరకంగా వ్యాయామాలు చేస్తూ చురుగ్గా ఉండడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి కూడా విటమిన్ బి12 లోపాన్ని ఎంతోకొంత అధిగమించేలా చేస్తాయి.
ఏది ఏమైనా విటమిన్ బి12 ఉన్న ఆహారాలను కూడా అధికంగా తీసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు. ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు, ఒక గ్లాసు పాలు తాగడం అలవాటు చేసుకోండి. అలాగే లీన్ ప్రోటీన్ ఉండే చికెన్, చేపలు వంటివి రెండు మూడు రోజులకు ఒకసారి కొంచెం మొత్తంలో తినడం అలవాటు చేసుకుంటే... విటమిన్ బి12 లోపం రాకుండా ఉంటుంది. పిల్లల్లో కూడా ఈ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే. అప్పుడే వారి మానసిక ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది.
టాపిక్