Bindi | నుదుట బొట్టు విశిష్టత ఏంటి? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి?
హిందూ సంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు పెట్టుకుని ఉన్న స్త్రీ లక్ష్మీ దేవితో సమానం అంటారు పెద్దలు. లక్ష్మీ దేవి నివాసం ఉండే 5 స్థానాల్లో రెండో స్థానం నుదుట బొట్టు అని చెబుతారు.
నుదుట బొట్టు భారతీయ సంప్రదాయం. బొట్టు వల్ల అందంగా కనిపించడమే కాదు.. ఆరోగ్యానికీ ప్రయోజనకరమని పెద్దలు చెబతారు. బొట్టు పెట్టుకునేటప్పుడు.. ‘సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే’ అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకోవడం శుభకరం అని పెద్దలు చెబుతారు. బొట్టు ఐదో తనానికి సంకేతమైనందున ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.
ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి?
మధ్య వేలితే బొట్టు పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని నమ్మకం. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుందట. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది.
నాగ సింధూరం ధరిస్తే రుణ బాధల నుంచి విముక్తి పొందుతారని, సర్పదోషాలు, నాగదోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతారు. అరావళి కుంకుమ ధరిస్తే ఇంట్లో గొడవలు సద్దుమణుగుతాయని విశ్వాసం. వైధవ్యం పొందినస్త్రీలు గంగ సింధూరం లేదా ఆంజనేయస్వామి బొట్టు అని పిలిచే బొట్టును ధరించవచ్చు.
సంబంధిత కథనం