Stomach Cancer: ఇలా తింటే పొట్ట క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే, ఈ ఆహారపు అలవాట్లు మీకుంటే వదిలేయండి-if you eat like this you will get stomach cancer so leave these eating habits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stomach Cancer: ఇలా తింటే పొట్ట క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే, ఈ ఆహారపు అలవాట్లు మీకుంటే వదిలేయండి

Stomach Cancer: ఇలా తింటే పొట్ట క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే, ఈ ఆహారపు అలవాట్లు మీకుంటే వదిలేయండి

Haritha Chappa HT Telugu
Mar 09, 2024 11:41 AM IST

Stomach Cancer: క్యాన్సర్ ఎప్పుడు, ఎవరి మీద దాడి చేస్తుందో చెప్పడం చాలా కష్టం. సాధారణంగా ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో పొట్ట క్యాన్సర్ ఒకటి. కొన్ని రకాల అలవాట్ల వల్ల పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

పొట్ట క్యాన్సర్ ను తెచ్చిపెట్టే ఆహారాలు
పొట్ట క్యాన్సర్ ను తెచ్చిపెట్టే ఆహారాలు (pixabay)

Stomach Cancer: ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మనదేశంలో కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. సాధారణంగా ఎక్కువ మందిలో వస్తున్న క్యాన్సర్... పొట్ట క్యాన్సర్. పొట్ట క్యాన్సర్ రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. మీ పొట్ట లోపల కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు అది క్యాన్సర్ కణితిగా మారుతుంది. గ్యాస్ట్రిక్, అల్సర్ల సమస్యలు కూడా ఒక్కోసారి క్యాన్సర్‌కు కారణం అవుతాయి. పొట్ట క్యాన్సర్లో 95% పొట్ట లోపలి లైనింగ్ లోనే క్యాన్సర్ కణాలు పెరగడం ఆరంభమవుతాయి. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే ఒక తీవ్రమైన క్యాన్సర్ గా మారి కాలేయం, ప్యాంక్రియాటిక్ అవయవాలకు సోకుతుంది. అందుకే పొట్ట క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

పొట్ట క్యాన్సర్ రావడానికి కారణాలు

అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే వాటికి వెంటనే చికిత్స తీసుకోండి. ఆ రెండూ కూడా తీవ్రమైతే పొట్ట క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు పొట్టకు హాని చేస్తాయి. అలాంటి ఆహారాలు అధికంగా తింటే పొట్ట క్యాన్సర్ బారిన పడవచ్చు. ముఖ్యంగా అధిక ఉప్పు వేసి నిల్వ చేసిన చేపలు, మాంసం, ఊరగాయలు వంటివి అధికంగా తింటే ఈ సమస్యలు రావచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలు కాల్చిన లేదా బొగ్గుల మీద వండిన మాంసాలను తినడం వల్ల కూడా పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

అలాగే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు త్వరగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారుతాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొందరిలో క్యాన్సర్ వస్తుంది. కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు ముఖ్యంగా... ప్రాసెస్ చేసిన మాంసం, ధూమపానం, ఉప్పు నిండిన ఆహారాలు వంటివి తినడం వల్ల దీర్ఘకాలంలో పొట్ట క్యాన్సర్ రావచ్చు. అలాగే హాట్ డాగ్స్, సాసేజ్‌లు వంటివి అధికంగా తింటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది. ఈ ఆహారాలు పొట్టలో చేరి క్యాన్సర్ కారకాలను సృష్టిస్తాయి.

వేయించిన ఆహారాలు రుచికరంగా ఉంటాయి. కానీ అవి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాలను వేయిస్తే అందులో ఉన్న పిండి పదార్థాలు అక్రిలమైడ్ అనే సమ్మేళనాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా బంగాళదుంప వంటకాలను డీప్ ఫ్రై చేయడం వల్ల కాన్సర్ కారకాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తినడం మానేయాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయి.

చక్కెర పదార్థాలు

మీ ఆహారంలో చక్కెర నిండిన పదార్థాలను తక్కువగా తింటే మంచిది. ఎందుకంటే చక్కెర ఆహారాలు పొట్ట క్యాన్సర్ కు పరోక్షంగా సహాయపడతాయి. తీయటి పానీయాలు, బియ్యం, చక్కెర, తృణధాన్యాలు వంటివి పొట్ట క్యాన్సర్ అవకాశాలను పెంచుతాయి. మద్యం తాగే వారు కూడా అలవాటుగా మానుకోవాలి. ఇది కాలేయంలో చేరాక విచ్ఛిన్నమవుతుంది. క్యాన్సర్ కారక సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరానికి చాలా కీడు చేస్తుంది.

Whats_app_banner