Being emotionally reactive: ఎమోషనల్‌గా రియాక్టవుతున్నారా? ఈ టిప్స్‌తో మానుకోండి-how to stop being emotionally reactive therapist shares tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Being Emotionally Reactive: ఎమోషనల్‌గా రియాక్టవుతున్నారా? ఈ టిప్స్‌తో మానుకోండి

Being emotionally reactive: ఎమోషనల్‌గా రియాక్టవుతున్నారా? ఈ టిప్స్‌తో మానుకోండి

Tapatrisha Das HT Telugu
Feb 11, 2023 11:00 AM IST

Being emotionally reactive: ఎమోషనల్‌గా రియాక్టవడం వల్ల ఫలితం ఉండకపోగా.. మీ బంధం బీటలు వారుతుంది. మీ భావోద్వేగాలకు అవతలి వారు పట్టించుకుంటారనుకోవడం పొరపాటే. అందువల్ల మీ చెప్పదలుచుకున్న స్పందనను మీ ఎమోషన్స్ తగ్గించుకుని చెప్పండి.

How to stop being emotionally reactive: Therapist shares tips
How to stop being emotionally reactive: Therapist shares tips (Getty Images/iStockphoto)

తరచుగా మనం మన అంతర్గత భావోద్వేగ స్థితికి ప్రతిస్పందిస్తాం. ఇది బంధాల మధ్య మరింత దూరం పెంచుతుంది. కష్టతరమైన భావోద్వేగ దశలను ఎదుర్కొంటున్న వ్యక్తులు మానసికంగా రియాక్టివ్‌గా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది భావోద్వేగ స్థితికి మరింత హాని కలిగించవచ్చు. భావోద్వేగాలతో రియాక్ట్ అవడాన్ని నియంత్రించేందుకు కొంత ప్రాక్టీస్ అవసరం. దీనిని ప్రస్తావిస్తూ సైకాలజిస్ట్ నికోల్ లెపెరా కొన్ని అంశాలు పంచుకున్నారు. ‘ఈ అభ్యాసం నిజంగా మనస్సు, శరీరం కొత్త మార్గాల్లో స్పందించడానికి సహాయపడుతుంది..’ అని వివరించారు.

ఎమోషనల్‌గా రియాక్టివ్‌గా ఉండకూడదంటే..

ఎమోషనల్‌గా రియాక్టివ్‌గా ఉండకూడదంటే ఏం చేయాలో సైకాలజిస్ట్ నికోల్ పలు సూచనలు చేశారు.

విరామం: మనం తీవ్రమైన భావోద్వేగాలను అనుభవించిన ప్రతిసారీ, ఆ సందర్భంలో ప్రతిస్పందించే ముందు మనం ఒక విరామం తీసుకోవాలి. మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మన ఆలోచనలను కూడగట్టుకోవడానికి, ప్రతిస్పందించడానికి ముందు మనల్ని మనం కంపోజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది.

సెన్సేషన్స్: భావోద్వేగ సందర్భాలలో శరీరం పలు కంపనలకు గురవుతుంది. కడుపులో వికారం  నుండి మొదలు గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం వరకు మనం సాధారణంగా శరీరంలో చాలా అనుభూతులను అనుభవిస్తాం. వాటిని గుర్తించి వాటిపై శ్రద్ధ పెట్టడం అవసరం.

శ్వాస: లోతైన, స్థిరమైన శ్వాస శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరానికి రక్షణ సంకేతాలను పంపుతుంది. శరీరం ఉద్రిక్తంగా అనిపించినప్పుడు లోతైన స్థిరమైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం మంచిది.

రిలీజ్: నాడీ వ్యవస్థను తిరిగి సమతుల్యం చేయడానికి ఏడుపు, వణుకు లేదా శరీరాన్ని కదిలించడం ద్వారా భావోద్వేగాలను విడుదల చేయడం ముఖ్యం.

స్పందన: సందర్భానికి రియాక్టవడం కాకుండా, విరామం తీసుకొని దానికి స్పందించడం ముఖ్యం.

WhatsApp channel