Papaya Halwa : బొప్పాయి హల్వా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం-how to prepare papaya halwa to boost immunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Papaya Halwa : బొప్పాయి హల్వా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Papaya Halwa : బొప్పాయి హల్వా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Anand Sai HT Telugu
Jan 01, 2024 03:30 PM IST

Papaya Halwa : బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా నేరుగానే దీనిని తినేస్తారు. అందుకు బదులుగా బొప్పాయి హల్వా తయారు చేసి తినండి. పిల్లలు కూడా ఇష్టంగా లాగించేస్తారు.

బొప్పాయి హల్వా
బొప్పాయి హల్వా

బొప్పాయి హల్వా ఆరోగ్య నిధి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని పండ్లలో బొప్పాయి పండుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బొప్పాయి కడుపునకు చాలా మేలు చేస్తుంది. బొప్పాయిని రోజూ తింటే చర్మం మెరిసిపోతుంది. మచ్చలు లేకుండా ఉంటాయని నమ్ముతారు. అయితే మీరు బొప్పాయిని పండులా తిని ఉంటారు.. కానీ బొప్పాయితో చేసిన స్వీట్ తింటే చాలా బాగుంటుంది.

బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం. జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ తీపి బొప్పాయి వంటకం మీకు నచ్చుతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఈ హల్వా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మీరు మీ భోజనం తర్వాత ఈ డెజర్ట్ తినవచ్చు. ఆరోగ్యకరమైన స్వీట్లు తినాలనుకుంటే, ఇంట్లో బొప్పాయి హల్వా చేయండి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమిషాల్లో తయారు చేయగల బొప్పాయి హల్వా వంటకం గురించి తెలుసుకుందాం తెలుసుకుందాం.

బొప్పాయి హల్వాకు కావాల్సిన పదార్థాలు

పండిన బొప్పాయి - 1, పాలు - అర లీటరు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర tsp, డ్రై ఫ్రూట్స్ - 1 కప్పు, నెయ్యి - 2 tsp

బొప్పాయి హల్వా తయారీ విధానం

1. ముందుగా పండిన బొప్పాయిని తీసుకుని తోలు తీసి పెద్ద ముక్కలుగా కోయాలి.

2. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఓవెన్లో ఉంచండి. తర్వాత బాణలిలో నెయ్యి వేయాలి. తర్వాత నెయ్యి కరిగించి ముక్కలను వేయాలి.

3. రెండు మూడు నిముషాలు తిప్పి, బొప్పాయి ముక్కలను బాగా మెత్తగా మగ్గనివ్వాలి.

4. దీని తర్వాత ఉడికించిన బొప్పాయిలో పాలు వేసి కలుపుతూ ఉండాలి.

5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాల లాగా మారే వరకు బాగా రుబ్బుకోవాలి.

6. దీని తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

7. ఇప్పుడు 2 నుండి 3 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దానికి పంచదార వేయాలి.

8. కొద్దిసేపటి తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్‌ వేసి కలపాలి.

9. కొంత సమయం తర్వాత హల్వా మంచి వాసన రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.

10. పోషకమైన, రుచికరమైన బొప్పాయి హల్వా సిద్ధంగా ఉంది. తర్వాత డ్రై ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

Whats_app_banner