Mini Pizza: ఓవెన్, ఈస్ట్ వాడకుండా.. ఈ మినీ పీజ్జాలు చేసేయండి..-how to prepare mini pizzas at home for evening snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mini Pizza: ఓవెన్, ఈస్ట్ వాడకుండా.. ఈ మినీ పీజ్జాలు చేసేయండి..

Mini Pizza: ఓవెన్, ఈస్ట్ వాడకుండా.. ఈ మినీ పీజ్జాలు చేసేయండి..

Koutik Pranaya Sree HT Telugu
Nov 06, 2023 04:30 PM IST

Mini Pizza: సాయంత్రం స్నాక్స్ లోకి సులభంగా చేసుకునే వంటకం మినీ పిజ్జా. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

మినీ పిజ్జా
మినీ పిజ్జా (pexels)

సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ లోకి ఈ మినీ పిజ్జాలు ప్రయత్నించండి. ఓవెన్ అవసరం లేదు, ఈస్ట్ కూడా వేయక్కర్లేదు. దాదాపుగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తక్కువ సమయంలో ఈ మినీ పిజ్జాలు రెడీ అయిపోతాయి. అదెలాగో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల మైదా

¼ టీస్పూన్ బేకింగ్ సోడా

1 స్పూన్ బేకింగ్ పౌడర్

¼ స్పూన్ ఉప్పు

¼ కప్పు పెరుగు

½ కప్పు పాలు

2 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె

పిజ్జా టాపింగ్స్ కోసం:

క్యాప్సికమ్ , తరిగిన ముక్కలు

ఉల్లిపాయ , తరిగిన ముక్కలు

టమోటా , తరిగిన ముక్కలు

స్వీట్ కార్న్

ఆలివ్స్, తరిగిన ముక్కలు

చీజ్ తురుము

చిల్లీ ఫ్లేక్స్

మిక్స్డ్ హెర్బ్స్

తయారీ విధానం:

  1. ముందుగా ఒక పెద్దగిన్నెలో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  2. అందులో పావు కప్పు పెరుగు, సగం కప్పు పాలు పోసుకుని పిండిని బాగా కలుపుకోవాలి.
  3. ముద్దలాగా అయ్యాక కొద్దిగా ఆలివ్ నూనె వేసుకుని మరోసారి పిండిని మృదువుగా కలుపుకోవాలి. ఒక గంటపాటూ ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పిండిని చిన్న ఉండల్లా చేసుకుని చిన్న చిన్న చపాతీల్లాగా, కాస్త మందంగా ఒత్తుకోవాలి. ఇవి పొంగకుండా ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి.
  5. ఒక తావా మీద వీటిని పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. పిజ్జా బేస్ రెడీ అయినట్లే
  6. ఇప్పుడు ఈ బేస్ మీద కొద్దిగా పీజ్జా సాస్ రాసుకోవాలి. మీద ఇష్టమున్న కూరగాయల ముక్కలు బాగా సర్దుకోవాలి. మీద చీజ్ తురుము వేసుకోవాలి.
  7. వేడిగా ఉన్న పెనం మీద వీటిని పెట్టుకుని మూత పెట్టుకోవాలి. సన్నం మంట మీద ఉడకనివ్వాలి. చివరగా చీజ్ కరిగి, బేస్ ఉడకగానే మీద చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవడమే.

Whats_app_banner