CPR | హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? డాక్టర్ విరించి విరివింటి -how to perform cpr for heart attack victims ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cpr | హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? డాక్టర్ విరించి విరివింటి

CPR | హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? డాక్టర్ విరించి విరివింటి

HT Telugu Desk HT Telugu
Feb 28, 2022 02:43 PM IST

మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చి పేషెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేనప్పుడు సీపీఆర్ ఎలా చేయాలో క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విరించి విరివింటి ఇలా వివరిస్తున్నారు.

<p>సీపీఆర్ ప్రక్రియ&nbsp;</p>
సీపీఆర్ ప్రక్రియ (unsplash)

మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన వారు హఠాన్మరణం చెందుతారని డాక్టర్ విరించి విరివింటి తెలిపారు. ‘మాసివ్ హార్ట్ ఎటాక్ వస్తే బతకడం కష్టం. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొందరు నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఒకతను కళ్లు తిరిగి పడిపోతే.. మేం అక్కడికి వెళ్లేసరికి నోట్లో నీళ్లు పోసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. నీళ్లు పోసినప్పుడు పేషెంట్ కాన్షియస్‌గా ఉన్నప్పుడు పోయవచ్చు. కానీ కాన్షియస్‌గా లేనప్పుడు ఆ నీళ్లు లంగ్స్‌లోకి వెళ్లి మరింత ప్రమాదం ఏర్పడుతుంది. మేజర్ హార్ట్ అటాక్ అయితే పేషెంట్ కూలబడిపోతాడు. అలాంటి సందర్భంలో సీపీఆర్ చేయాలి. సీపీఆర్ అంటే కార్డియో పల్మరీ రిసస్కిటేషన్. అది ఎలా చేయాలి? సీపీఆర్ ప్రాసెస్ మొదలు పెడుతూనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. లేదా ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.

సీపీఆర్ ప్రాసెస్ ఇలా..

స్టెప్ 1: ఫ్లాట్ సర్ఫేస్‌పై పడుకోబెట్టాలి.  అంటే బల్లపరుపుగా ఉన్న ప్లేస్‌లో పడుకోబెట్టాలి. రెస్పాన్స్ అవుతున్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. రెస్పాన్స్ లేనప్పుడు పల్స్ చూడాలి. మేజర్ హార్ట్ అటాక్ అయితే పల్స్ దొరకదు. మెడ వద్ద పల్స్ చూడాలి. ఒకవేళ అక్కడ కూడా పల్స్ దొరకలేదంటే హార్ట్ ఆగిపోయినట్టు గుర్తించాలి. 

స్టెప్ 2: ఆగిపోయిన హార్ట్‌ను రన్ చేసేందుకు సీపీఆర్ చేయాలి. ఎడమ చేయి వేళ్ల మధ్య కుడి చేయి వేళ్లు జొప్పించి లేదా కుడిచేయి వేళ్లల్లో ఎడమ చేయి జొప్పించి పేషెంట్ చాతీ మీద (గుండె పై కాదు.. ) అంటే చాతీ మధ్య భాగంలో నొక్కాలి. ప్రెస్ చేస్తూ ఉండాలి. నొక్కేటప్పుడు మన చేతులు  మోచేతులు బెండ్ కాకూడదు. చేతులు స్టిఫ్‌గా ఉంచి నొక్కాలి. చాతీ కనీసం 5 సెంటిమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. విముకలు విరిగిపోతాయని భయపడకూడదు. నిమిషానికి వందసార్లు, అంతకంటే ఎక్కువగా చేయాలి. కౌంట్ చేస్తూ, నిమిషానికి 100 నుంచి 120 సార్లు ప్రెస్ చేయాలి. 

ఒక నిమిషం చేశాక పల్స్ చెక్ చేయండి. పల్స్ దొరకకపోతే మళ్లీ కొనసాగించాలి. ఇట్లా ఒక్కోసారి 20 నిమిషాలు చేస్తూనే ఉండాలి. కంటిన్యూయస్‌గా చేస్తున్నప్పుడు గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం కలుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేస్తే ప్రయోజనం ఉంటుంది. చాాలా ఆలస్యం చేస్తే లాభం ఉండదు. ఇవన్నీ చేస్తూనే 108కి గానీ, ఆంబులెన్స్‌కు గానీ, ఆస్పత్రి ఆంబులెన్స్‌కు గానీ ఫోన్ చేయాలి. 

ముఖంలో నోరు పెట్టి గాలి ఊదడం వంటివి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. సీపీఆర్ మాత్రమే మేలు చేస్తుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం నోట్లో గాలి ఊదడం అవసరం లేదు. సీపీఆర్ చేస్తూనే ఆంబులెన్స్ సంప్రదించాలి. 

సీపీఆర్ ప్రాసెస్ అందరూ నేర్చుకోవాలి. ఈ ప్రక్రియ సరిగ్గా చేస్తే అనేక ప్రాణాలు కాపాడవచ్చు. డాక్టర్ విరించి వీడియో ఇక్కడ చూడొచ్చు.

Whats_app_banner