DIY Lip Balm: డీప్ హైడ్రేషన్ అందించే లిప్ బామ్‌ని ఇంట్లోనే తయారుచేసుకోండిలా..-how to make your own lip balm at home with natural ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Lip Balm: డీప్ హైడ్రేషన్ అందించే లిప్ బామ్‌ని ఇంట్లోనే తయారుచేసుకోండిలా..

DIY Lip Balm: డీప్ హైడ్రేషన్ అందించే లిప్ బామ్‌ని ఇంట్లోనే తయారుచేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu
Aug 22, 2023 03:07 PM IST

DIY Lip Balm: డీప్ హైడ్రేషన్ అందించే లిప్‌బామ్ కోసం చూస్తున్నారా? ఇంటివద్ద మీరే ఇలా తయారు చేసుకోండి.

ఇంటి వద్దే డీప్ హైడ్రేషన్ లిప్ బామ్ తయారు చేయండిలా
ఇంటి వద్దే డీప్ హైడ్రేషన్ లిప్ బామ్ తయారు చేయండిలా

ఇంట్లో ఉన్నా.. ఆరుబయట ఉన్నా.. మీ పెదవులకు హైడ్రేషన్ చాలా ముఖ్యం. లేదంటే అవి పొడిబారిపోయి అందవిహీనంగా కనిపిస్తాయి. కాబట్టి సరైన లిప్ బామ్‌ని ఎంచుకోవడం వల్ల మీ పెదవులు అందంగా మెరుస్తాయి. అయితే ఎలాంటి లిప్ బామ్‌ని ఎంచుకోవాలనే దానిపై మీకు సందేహం ఉంటే మీరే స్వయంగా ఓ లిప్ బామ్‌ని తయారు చేసుకోండి.

దాదాపు ప్రతి అమ్మాయి ఎక్కడికి వెళ్లినా తనతో పాటు లిప్ బామ్ కచ్చితంగా తీసుకెళ్తుంది. ఎందుకంటే తగినంత హైడ్రేషన్ పెదవులకు అందిచకపోతే అవి పొడిబారి పగిలిపోతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చాలామంది లిప్ బామ్స్ ఉపయోగిస్తారు. అయితే మీ పెదవులకు హైడ్రేషన్ అందించే లిప్ బామ్‌ మార్కెట్లో దొరకట్లేదా? అయితే మీరే దానిని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇది మీ పెదవులకు డీప్ హైడ్రేషన్ అందించడమే కాకుండా మృదువైన, మెరిసే నిగారింపుని అందిస్తుంది. మరి ఈ అద్భుతమైన లిప్ బామ్‌ని ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లిప్‌బామ్‌కు కావాల్సినవి

  1. కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
  2. ఖాళీ లిప్ బామ్ కంటైనర్ - 1
  3. బీస్వాక్స్ పీలెట్స్ - 1/2 టేబుల్ స్పూన్
  4. అవకాడో నూనె - 2 టేబుల్ స్పూన్లు (ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు)
  5. ఎషెన్షియల్ ఆయిల్స్ - 3-4 చుక్కలు
  6. తేనె - 1 టేబుల్ స్పూన్
  7. కోకో పౌడర్ - 1/2 టేబుల్ స్పూన్ (ఫ్లేవర్ కోసం)

లిప్ బామ్ తయారీ విధానం

మృదువైన మిశ్రమం వచ్చేవరకు బిస్వాక్స్ పీలెట్స్ ను కరిగించాలి. ఇలా కరిగించడం కష్టం అనుకుంటే మీరు మైక్రోవేవ్‌తో ఈజీగా కరిగించవచ్చు. దానిలో కోకోపౌడర్ వేసి కలపండి. అనంతరం కొబ్బరి నూనె, అవకాడో నూనె, ఎషెన్షియల్ ఆయిల్స్ వేసి నూనెలన్నింటినీ బాగా కలపండి. అనంతరం ముడి తేనేవేసి మరింత బాగా కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత లిప్ బామ్ కంటైనర్‌లో వేయండి.

మెరుగైన ఫలితాల కోసం దీనిని రోజూ వినియోగించండి. ఈ లిప్ బామ్ మీ పెదవులకు మంచి హైడ్రేషన్‌ను అందిస్తుంది. తద్వారా మీ పెదవులు పొడిబారకుండా రోజంతా నిగనిగలాడుతూ ఉంటాయి.

Whats_app_banner