Soft Idli tips: హోటల్‌‌లో లాగా ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి-how to make idlis soft every time like hotel know these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soft Idli Tips: హోటల్‌‌లో లాగా ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి

Soft Idli tips: హోటల్‌‌లో లాగా ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 07, 2024 06:30 PM IST

Soft Idli tips: ఇడ్లీలు ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని అల్పాహారం. అయితే అవి రుచిగా, హోటల్ లో లాగా మృదువుగా,మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు
మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు (Shutterstock )

ఉదయం అల్పాహారంలోకి ఇడ్లీలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇంట్లో చేసే ఇడ్లీలు అంత మెత్తగా రావు. హోటల్‌లో చేసే ఇడ్లీలు చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. అలాంటి ఇడ్లీలో ఇంట్లోనూ చేసుకోవాలనుకుంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

మెత్తని ఇడ్లీ కోసం చిట్కాలు:

1. ఇడ్లీ పిండి తయారు చేసేటప్పుడు బియ్యం, మినప్పప్పు మోతాదు ముఖ్యం. ప్రతి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు వాడాలి. మినప్పప్పు ఎక్కువగా వాడినా ఇడ్లీలు మృదువుగా రావు.

2. మృదువైన ఇడ్లీలు తయారు చేయడానికి పిండిని తయారు చేసేటప్పుడు బాస్మతి బియ్యాన్ని ఎప్పుడూ వాడకూడదు. ఇడ్లీ రైస్ లేదా పార్ బాయిల్డ్ రైస్ వాడితే మంచిది. మీడియం లేదా స్మాల్ గ్రెయిన్ బియ్యాన్ని మాత్రమే ఇడ్లీ పిండి కోసం వాడండి. సన్నం బియ్యం వాడక్కర్లేదు.

3. నానబెట్టిన బియ్యం, మినప్పప్పు గ్రైండ్ చేయడానికి ఫుడ్ ప్రాసెసర్ కు బదులుగా వెట్ గ్రైండర్ ను ఉపయోగించండి. పప్పులు, బియ్యాన్ని గ్రైండ్ చేయడానికి ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి నీళ్లు కలపాలి. గ్రైండ్ చేసేటప్పుడు మిశ్రమం వేడెక్కకుండా చల్లని నీటిని ఉపయోగించాలి. ఇలా చల్లని నీళ్లు వాడితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

4. ఇడ్లీని మెత్తగా వచ్చేలా చేయడంలో మెంతులు ఎంతగానో సహాయపడతాయి. ఒకటిన్నర నుంచి రెండు టీస్పూన్ల మెంతులను బియ్యం, పప్పులతో కలిపి నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ మెత్తగా మారడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది.

5. ఇడ్లీ మెత్తగా రావాలంటే పిండిని గ్రైండ్ చేసుకున్నాక మీ చేతులతో అయిదు నిమిషాలు బాగా బీట్ చేయండి. తర్వాత పులియబెట్టడానికి వదిలేయండి. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలి చొరబడుతుంది. దీంతో ఇడ్లీలు మృదువుగా అవుతాయి. అలాగే వీటిని పులియబెట్టడానికి ప్లాస్టిక్ డబ్బాలు, ఎయిర్ టైట్ కంటెయినర్లు వాడకూడదు.

టాపిక్