Tasty Atukulu Chuduva : కరకరలాడే అటుకుల చుడువా.. 5 నిమిషాల్లో చేసేయండి
Tasty Atukulu Recipe : కరకరలాడే అటుకులు తింటే ఆ టేస్టే వేరు. ఎన్ని స్నాక్స్ తిన్నా.. అటుకులు తింటే వచ్చే ఆనందం బాగుంటుంది. అయితే అటుకుల చుడువాను ఇలా టేస్టీగా చేసేందుకు ట్రై చేయండి.
ఇంట్లో అమ్మ చేసే అటుకుల రుచి బాగుంటుంది. మెుదట కొన్ని తినాలని మెుదలుపెడతాం.. కానీ తింటుంటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. అటుకులు తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది రైస్ తయారైంది కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు ఉండవు. నిజానికి ఎవరైనా అతిథులు ఆకస్మాత్తుగా వస్తే.. ఇంట్లో స్నాక్స్ సిద్ధంగా ఉండవు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్ కోసం వెతుకుతాం. 5 నిమిషాల్లో ఇంట్లోనే రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.
స్నేహితులు, బంధువులు ఇంటికి వచ్చి వారికి ఇచ్చేందుకు వీలుగా రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని 5 నిమిషాల్లో రెడీ చేయెుచ్చు. టీ, కాఫీతో ఆస్వాదించడానికి బాగుంటుంది. రుచికరమైన అటుకుల చుడువా చేయడం ఎలా? ఆ పదార్థాలు ఏంటో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు : 2 కప్పుల సన్నని అటుకులు, 2 టేబుల్ స్పూన్లు నూనె, 1/4 కప్పు శనిగలు, 1/4 కప్పు జీడిపప్పులు, 10-15 కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు పొడి, కాస్త వేరుశెనగలు, పచ్చిమిర్చి 8, ఉప్పు రుచికి సరిపడా,
తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 2 కప్పుల అటుకులు వేయించాలి. చిన్న మంట మీద వేడి చేసి కరకరలాడే వరకు వేయించాలి. తర్వాత విడిగా ప్లేట్‌లో పెట్టుకోవాలి. అదే పాన్ తుడిచి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. 1/4 కప్పు శనిగలు, వేరుశెనగలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. 1/4 కప్పు జీడిపప్పు వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, 10-15 కరివేపాకు, 1/2 టీస్పూన్ నువ్వులు, చిటికెడు ఇంగువ వేయాలి. అన్ని పదార్థాలను లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. 1/4 tsp పసుపు పొడి, రుచికి ఉప్పు జోడించండి. కాసేపు కలపాలి. అంతే రుచికరమైన అటుకుల చుడువా రెడీ.
గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. అయితే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే అందులో వేయాలి. ఇది 2-3 వారాల వరకూ ఉంటాయి. టీ, కాఫీతో ఆనందించవచ్చు. దీన్ని కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. చలికాలంలో ఎంచక్కా లాగించేయెుచ్చు.