కిటికీ అద్దాలు మిళమిళ మెరవాలంటే? ఈ చిట్కాలను పాటించండి!-how to clean your windows in three easy steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కిటికీ అద్దాలు మిళమిళ మెరవాలంటే? ఈ చిట్కాలను పాటించండి!

కిటికీ అద్దాలు మిళమిళ మెరవాలంటే? ఈ చిట్కాలను పాటించండి!

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 03:44 PM IST

కిటికీల గ్లాస్‌లు తొందరగా మురికిగా మారుతుంటాయి. కిటికీలను శుభ్రం చేయడానికి రకారకాల గ్లాస్ క్లీనర్‌లను ఉపయోగిస్తారు, అలా కాకుండా సులువుగా ఇంట్లోని గాజును సరికొత్తగా మెరిసేలా చేసే కొన్ని హక్స్‌ల గురించి ఇప్పుడు తెలుకుందాం

how to clean glass window in telugu
how to clean glass window in telugu

క్లీనింగ్ టిప్స్: ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఇంట్లోని మనుషులు అంతా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. అయితే ప్లోర్, ఇతర వస్తువులను శుభ్రం చాలా ఈజీ... కానీ ఎక్కువగా దుమ్ము-దూళిగా ఉండే కిటికీలు, తలుపులను క్లీన్ చేయడం కొంత కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా కిటికీలు గ్లాస్ తొందరగా మురికిగా మారుతుంటాయి. కిటికీలను శుభ్రం చేయడానికి రకారకాల గ్లాస్ క్లీనర్‌లను ఉపయోగిస్తారు, అలా కాకుండా సులువుగా ఇంట్లోని గాజును సరికొత్తగా మెరిసేలా చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుకుందాం.

వంట సోడా

వంటగదిలో ఉపయోగించే బేకింగ్ సోడా సహాయంతో ఇంటి కిటికీలలోని గాజును శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం మెత్తని గుడ్డపై కొద్దిగా బేకింగ్ సోడాను రాసి గాజుపై రుద్దండి. దీని తర్వాత శుభ్రమైన కాటన్ గుడ్డ, నీటితో కిటికీలను శుభ్రం చేయండి.

వెనిగర్

వెనిగర్ ఉపయోగించి కూడా ఇంట్లో గాజును శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీరు స్ప్రే బాటిల్‌లో వెనిగర్ నింపండి. ఇప్పుడు శుభ్రం చేయవలసి వచ్చినప్పుడల్లా, కిటికీల గాజుపై స్ప్రే చేసి, శుభ్రమైన గుడ్డతో తుడవండి.

డిష్ షాప్

సాధారణంగా వంటింట్లో గిన్నెలు కడుగడానికి డిష్ షాప్‌ను ఉపయోగిస్తాం. కిటికీల అద్దాలను శుభ్రం చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని కోసం, స్ప్రే బాటిల్‌లొ నీటిని కలపండి. ఇప్పుడు కిటికీ మీద పిచికారీ చేయండి. ఆ తర్వాత గుడ్డతో రుద్దాలి. విండో క్లియర్‌గా కనిపిస్తుంది.

ఉ ప్పు

మీరు ఉప్పును ఉపయోగించి కూడా విండో గ్లాస్‌ని కూడా పాలిష్ చేయవచ్చు. దీని కోసం నీటిలో కొద్దిగా ఉప్పు కలపండి. ఆ ద్రావణంతో గాజు మీద పోసి శుభ్రం చేయండి. ఉప్పులో ఉండే రసాయనాలు మురికిని శుభ్రపరచడంలో సహాయపడతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం