Laptop: ల్యాప్‌టాప్ హీటెక్కుతుందా? ఛార్జింగ్ పెట్టేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి!-how to check your laptops battery life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Laptop: ల్యాప్‌టాప్ హీటెక్కుతుందా? ఛార్జింగ్ పెట్టేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Laptop: ల్యాప్‌టాప్ హీటెక్కుతుందా? ఛార్జింగ్ పెట్టేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:17 PM IST

ల్యాప్‌టాప్స్ (laptops) వినియోగం పెరిగిపోయింది. రోజులో కనీసం 10 నుంచి 11 గంటల వరకు తమ అవసరాల కోసం ల్యాప్‌టాప్‌ను వాడుతున్నారు. ఇలా ఎక్కువ సమయం పాటు వాటిని వినియోగించడం ద్వారా అందులోని కొన్ని పార్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటరీ డ్రై అయిపోతుంది.

<p>ల్యాప్‌టాప్</p>
ల్యాప్‌టాప్ (AFP)

కరోనా కారణంగా దాదాపు 20 నెలలుగా చాలా మంది ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోం (Work From Home) నిర్వహిస్తున్నారు, విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు. దీంతో ల్యాప్‌టాప్స్ (laptops) వినియోగం పెరిగిపోయింది. రోజులో కనీసం 10 నుంచి  11 గంటల వరకు తమ తమ అవసరాల కోసం ల్యాప్‌టాప్‌ను వాడుతున్నారు. ఇలా ఎక్కువ సమయం పాటు వాటిని వినియోగించడం ద్వారా అందులోని కొన్ని పార్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటరీ డ్రై అయిపోతుంది.

సాధారణంగా ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రారంభంలో ఎక్కువ బ్యాకప్ ఇస్తాయి. వాటిని వాడుతున్న కొద్దీ బ్యాటరీ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. మీరు ఈ విషయాన్ని గుర్తించకపోతే ల్యాప్‌టాప్ సరిగ్గా పని చేయక మీ పనులకు అంటకం కలిగిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడూ మీ సిస్టమ్ బ్యాటరీ లైఫ్‌‌ను చెక్ చేస్తుండడం చాలా ముఖ్యం. తద్వారా మీరు బ్యాటరీ సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి, వీలైనంత త్వరగా దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. 

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ ఇలా చెక్ చేయండి..

  • ముందుగా Start button‌పై రైట్ క్లిక్ ఇవ్వండి
  • Windows PowerShell (Admin) ఆప్షన్‌ను ఎంచుకోండి
  • నీలిరంగుపవర్‌షెల్ విండోలో powercfg /batteryreport /output "C:\battery-report.html" అని టైప్ చేయండిలేదా పేస్ట్ చేయండి
  • ఇప్పుడు ఎంటర్ నొక్కండి
  • PowerShell బ్యాటరీ రిపోర్ట్ రూపొందిస్తుంది,  దానిని మీ కంప్యూటర్‌లో సేవ్ చేస్తుంది.
  •  బ్యాటరీ రిపోర్ట్ యాక్సెస్ చేయడానికి, Windows సెర్చ్ బార్‌లో PC అని టైప్ చేయండి.
  • తర్వాత This PC అప్లికేషన్‌పై ఎడమ క్లిక్ చేయండి.
  • "Devices and drives" హెడర్ C డ్రైవ్‌పై క్లిక్ చేయండి.
  • తర్వాత కనిపించే battery-report.html ఫైల్‌‌పై క్లిక్ చేయండి.

ఈ రిపోర్ట్‌లో, మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచి ఉంటాయి. మీ బ్యాటరీ సామర్థ్యం ఎంత? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని గంటలు పరిచేస్తుంది? వంటి విషయాలు అందులో ఉంటాయి. మీ బ్యాటరీ ఎంత త్వరగా డ్రై అవుతుందో తెలియజేసే డేటా గ్రాఫ్‌లను కూడా చూసుకోవచ్చు.

ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి!

ల్యాప్‌టాప్‌ని బెడ్ మీద కానీ, సోఫా మీద కానీ పెట్టి చార్జింగ్ పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల అందులోని హీట్ బయటకు రాదు, ల్యాప్‌టాప్‌లో అలానే ఉండిపోతుంది. దీని వల్ల బ్యాటరీ ఎక్కువగా వేడెక్కుతుంది, లైఫ్ కూడా తగ్గుతుంది. ఛార్జింగ్ పెట్టేటపుడు ల్యాప్‌టాప్‌ను గాలి తగిలేలా చల్లని ప్రదేశాల్లో ఉంచాలి. అలాగే బ్యాటరీ పూర్తిగా డ్రై అయ్యే వరకు వాడకూడదు. ఛార్జింగ్ ఎప్పుడూ కూడా 40 - 80 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది

Whats_app_banner