RRB ALP: రైల్వేలో లోకో పైలట్ అవ్వడం ఎలా?.. ఈ సింపుల్ గైడ్ మీ కోసమే!-how to become loco pilot in indian railways know details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rrb Alp: రైల్వేలో లోకో పైలట్ అవ్వడం ఎలా?.. ఈ సింపుల్ గైడ్ మీ కోసమే!

RRB ALP: రైల్వేలో లోకో పైలట్ అవ్వడం ఎలా?.. ఈ సింపుల్ గైడ్ మీ కోసమే!

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 03:54 PM IST

Railway Recruitment loco pilot: రైల్వేలో ఉద్యోగం సంపాదించడం దేశంలోని లక్షలాది మంది యువత కల. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిక్రూట్‌మెంట్లలో లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అన్ని రైల్వే ఉద్యోగాలలో లోకో పైలట్ ఉద్యోగం చాలా మంది యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

<p>Railway &nbsp;loco pilot</p>
Railway loco pilot

రైల్వేలో ఉద్యోగం సంపాదించడం ఈ దేశంలోని లక్షలాది మంది యువత కల. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్‌లకు ఏటా లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే రైల్వేలోని అన్ని ఉద్యోగాల కంటే యువతను ఎక్కువగా ఆకర్షించేది లోకో పైలట్ ఉద్యోగం. మరి భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్‌గా నియామక ప్రక్రియ ఏమిటి. గ్రాడ్యుయేషన్ లేకుండా అపాయింట్‌మెంట్ పొందడం సాధ్యమేనా? ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ముఖ్య విధి రైలును ఆపరేట్ చేయడం. భారతీయ రైల్వేలు ఎలక్ట్రిక్, మెకానికల్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో లోకో పైలట్‌లను నియమించుకుంటాయి. మెట్రిక్యులేషన్ తర్వాత ITI (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) నుండి కాయిల్ వైండింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికల్ వంటి ఏదైనా ట్రేడ్‌లో శిక్షణ పొందినవారు లేదా మెట్రిక్యులేషన్ తర్వాత గుర్తింపు పొందిన సంస్థ నుండి మూడేళ్ల డిప్లొమా చేసినవారు ఇండియన్ రైల్వేస్‌లో అసిస్టెంట్ లోకో పైలట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల వివరాల తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి. చివరిసారిగా 2018లో అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ జరిగింది.

ఎంపిక విధానం

1. ప్రిలిమినరీ పరీక్ష

2. CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్),

3. CBT,

4. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్

5. ఫిజికల్ ఫిట్‌నెస్

6. డాక్యుమెంట్ వెరిఫికేషన్.

భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకల్ పైలట్, అపాయింట్‌మెంట్/జాబ్ పోస్టింగ్ తర్వాత, కొన్ని నెలల పాటు వారికి శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన తర్వాత, కొన్ని సంవత్సరాల అనుభవం తదుపరి మొదటి గూడ్స్ రైలు ALPలకు (సీనియర్ లోకో పైలట్‌తో) అటాచ్ చేస్తారు. గూడ్స్ రైళ్లు తర్వాత ప్యాసింజర్ రైళ్లో అసిస్టెంట్ లోకో పైలట్ నియమించబడతారు. ప్యాసింజర్ రైళ్లలో మంచి అనుభవాన్ని పొందిన తర్వాత, తదుపరిది ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆ తర్వాత సూపర్ ఫాస్ట్ రైళ్లు, రాజధాని/ధురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు లోకో పైలట్‌గా నియమిస్తారు. అనుభవం పెరిగేకొద్దీ, లోకో పైలట్ గ్రేడ్‌లు, జీతం కూడా పెరుగుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం