గర్భిణీ స్త్రీలు ఎక్కువ నీరు త్రాగుతున్నారా? అయితే విషయం తెలుసుకోండి!
గర్భధారణ సమయంలోస్త్రీలు ఎక్కువ మెుత్తంలో నీరు త్రాగ కూడదని నిపుణులు చెబుతున్నారు. రు. నీరు ఎక్కువగా తాగడం వల్ల అలసటగా అనిపించడంతోపాటు కిడ్నీల పని తీరు పెరుగుతుంది. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది.
గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో అచుతూచి వ్వవహరించాలి. నియంత్రణ లేని.. అనారోగ్యకరమైన ఆహారం తల్లి, బిడ్డ ఇద్దరికీ హాని కలిగిస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో నీటి పరిమాణంలో జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే, ప్రతిరోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి, తద్వారా శరీరం బాగా హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే గర్భిణులు నీటిని ఎక్కువగా కానీ, తక్కువ కానీ తీసుకోకుండా సరైన మోతాదులో మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
నీరు, ఆక్సిజన్‌తో పాటు అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు గర్భిణీ స్త్రీలు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు సరైన మోతదులో నీటిని తీసుకోవడం ద్వారా ప్రినేటల్ విటమిన్లు శిశువుకు లభిస్తాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ సరైన మొత్తంలో నీరు త్రాగాలి. జీర్ణవ్యవస్థ కూడా నీటితో సరిగ్గా ఉంటుంది. శరీరం లోపల కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. నీరు ముఖ్యమని ఎక్కువ మెుత్తంలో నీరు త్రాగితే మాత్రం గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదం
సాధరణంగా నీరు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు, గర్భధారణ సమయంలో మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గుతాయి. సమతులమైన నీటిని తాగడం వల్ల శక్తివంతంగా ఉంటారు. శరీర ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచుతుంది.
ఎక్కువ నీరు వల్ల నష్టం: గర్భిణీ స్త్రీలకు అధికంగా నీరు త్రాగడం కూడా చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల అలసటగా అనిపించడంతోపాటు కిడ్నీల పని తీరు పెరుగుతుంది. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. మీరు ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయి పడిపోతుంది. శరీర సమతుల్యత కూడా దెబ్బ తింటుంది. ఇది తలనొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది.
సంబంధిత కథనం