Xpulse 200 4V Rally Kit | హీరో అడ్వెంచర్ బైక్ కోసం ర్యాలీ కిట్ విడుదల!-hero xpulse 200 4v bike rally kit launched at inr 46000 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Hero Xpulse 200 4v Bike Rally Kit Launched At Inr 46000

Xpulse 200 4V Rally Kit | హీరో అడ్వెంచర్ బైక్ కోసం ర్యాలీ కిట్ విడుదల!

HT Telugu Desk HT Telugu
Jul 14, 2022 09:51 PM IST

హీరో మోటోకార్ప్ తన Xpulse 200 4V అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం ర్యాలీ కిట్ విడుదల చేసింది. దీని వల్ల ప్రయోజనం ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

Hero Xpulse 200 4V
Hero Xpulse 200 4V

హీరో మోటోకార్ప్ తన పాపులర్ Xpulse 200 4V అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ర్యాలీ కిట్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ ర్యాలీ కిట్ Hero Xpulse 200 4V మోటార్‌సైకిల్ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆప్షనల్ ధర రూ. 46,000గా ఉంది.

ఈ కిట్‌ను టైర్, సస్పెన్షన్ అలాగే ఎర్గోనామిక్స్ అనే మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో భాగంగా టైర్ విభాగంలో Maxxis ర్యాలీ టైర్లు, సస్పెన్షన్ విభాగంలో 250mm వీల్ ట్రావెల్‌తో కూడిన ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కాట్రిడ్జ్-స్టైల్ ఫ్రంట్ ఫోర్క్, 220mm వీల్ ట్రావెల్‌తో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్, సస్పెన్షన్ విభాగంలో పొడవైన రియర్ స్టాండ్ హ్యాండిల్ బార్ రైజర్‌లు, బెంచ్-స్టైల్ సీట్, ఎక్స్‌టెండెడ్ గేర్ పెడల్ అలాగే ఎక్స్‌ట్రా-లాంగ్ సైడ్ స్టాండ్‌ వంటి హార్డ్‌వేర్ ఉన్నాయి.

ర్యాలీ కిట్‌ ప్రత్యేకంగా Xpulse 200 మోడల్ లోని 4 వాల్వ్ వేరియంట్ మోటార్‌సైకిల్ కలిగి ఉన్నవారికి మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన సామాగ్రి. Rally Kit ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత Xpulse బైక్ కొలతలు పెరుగుతాయి. పొడవు, వెడల్పు, ఎత్తు పెరుగుతాయి.

ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయడం తర్వాత కూడా Hero Xpulse 200 4V మోటార్‌సైకిల్ బరువు కేవలం 1 కిలో మాత్రమే పెరుగుతుండటం విశేషం. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 275 మిమీకి పెరుగుతుంది, ర్యాలీ కిట్ లేని దాని కంటే 55 మిమీ భారీ పెరుగుదల. వీల్‌బేస్ 9 మిమీ పెరుగుతుంది. ఈ Rally Kit ఇన్‌స్టాలేషన్‌తో Xpulse బైక్ ఆఫ్-రోడింగ్ ఎక్స్‌పీరియన్స్ అమాంతం పెరుగుతుంది.

అయితే ఈ ర్యాలీ కిట్ హీరో Xpulse 200 4V ఇంజిన్‌లో ఎటువంటి మార్పులను తీసుకురాలేదు. కాబట్టి మోటార్‌సైకిల్ యధావిధిగా 199.6cc సింగిల్-సిలిండర్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తోనే కొనసాగుతుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఈ ఇంజన్ 8,500rpm వద్ద 18.8bhp పవర్ అలాగే 6,500rpm వద్ద 17.35Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హీరో Xpulse 200 4V ధర ఎక్స్- షోరూమ్ వద్ద రూ, 1.33 లక్షలుగా ఉంది. ర్యాలీ కిట్ అమర్చుకోవాలనుకుంటే అదనంగా రూ.45 వేలు చెల్లించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్