Buddha Quotes: మీ జీవితంలో పాజిటివిటీని పెంచే గౌతమ బుద్ధుని స్పూర్తిదాయక సూక్తులు ఇవిగో
Buddha Quotes: మీరు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశకు గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారిలో స్పూర్తి నింపే మనుషులు పక్కన ఉండాల్సిందే. మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు గౌతమ బుద్ధుని ఈ ప్రేరణాత్మక సూక్తులు చదవండి.
విజయంతో స్నేహం చేయానలి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొద్దిమందికి మాత్రమే విజయవంతులయ్యే ఛాన్స్ దొరుకుతుంది. తరచుగా జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల అనేక రకాల గందరగోళం జీవితంలో ఏర్పడతాయి. వీటి వల్ల నిరాశ, డిప్రెషన్ వంటి లక్షణాలు కలుగుతాయి. దీని వల్ల వ్యక్తి తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకుంటాడు. అలా చేసి విజయానికి దూరంగా తానే వెళ్లిపోతాడు. మీరు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశ చుట్టుముట్టినప్పుడు కొంత మోటివేషన్ ప్రతి మనిషికి అవసరం. గౌతమబుద్ధుని బోధనలు మనిషిలో సానుకూల ఆలోచనలు పెంచేవిగా ఉంటాయి. గౌతమ బుద్ధుని ప్రేరణాత్మక సూక్తులు మీ మనస్సులో నిరాశ, గందరగోళం వంటివి తొలగించడానికి సహాయపడతాయి. గౌతమ బుద్ధుని ఈ బోధనలు ఒక వ్యక్తి జీవితాన్ని ప్రశాంతంగా మార్చడానికి మార్గనిర్దేశం చేస్తాయి.
గౌతమ బుద్ధుడి స్ఫూర్తిదాయక సూక్తులు
- ఒక మోసగాడు, దుష్ట స్నేహితుడు అడవి జంతువు కంటే ప్రమాదకరం. అడవి జంతువు మీ శరీరానికి మాత్రమే హాని కలిగిస్తుంది, కానీ దుష్ట స్నేహితుడు మీ మానసిక ఆరోగ్యానికే హాని చేయగలడు.
2. మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచే రహస్యం ఏమిటంటే - గతం గురించి చింతించకండి, భవిష్యత్తు గురించి బాధపడకండి. కానీ వర్తమానంలో తెలివిగా, నిజాయితీగా జీవించండి.
3. తక్కువ పదాలు మాట్లాడండి, ఎందుకంటే పదాలకు ఎంతో శక్తి ఉంటుంది.
4. ప్రతిరోజూ ఒక కొత్త రోజు, నిన్న ఎంత కష్టమైనప్పటికీ, ప్రతిరోజూ ఒక కొత్త ఉదయం ఒక కొత్త ఆశతో పుడుతుంది.
5. మీ వద్ద ఉన్న వస్తువులకు మీరు విలువ ఇవ్వకపోతే, మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.
6. మనం గతంలో ఇరుక్కోకూడదు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు, కానీ వర్తమానంలో జీవించాలి. ఆనందంగా జీవించడానికి ఇదే మార్గం.
7. తన మనస్సును జయించినవాడు లోకాన్ని కూడా జయించి తీరుతాడు.
8. జీవితంలో వేలాది యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు గెలుచుకోవడం మంచిది. అప్పుడు విజయం ఎప్పటికీ మీదే. దాన్ని మీ నుంచి ఎవరూ లాక్కోలేరు.
9. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే...
ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు
10. ఏదీ శాశ్వతం కాదు
నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు
ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు
11. అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్ధంగా ఉండు
సాధ్యమైనంతవరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు
ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి
నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి
12. సంపాదన శాశ్వతం కాదు
మన జీవితం శాశ్వతం కాదు
శాశ్వతంగా నిలిచేది ఒక్కటే
అదే మన మంచితనం
13. ఎన్నడూ ఈ ప్రపంచంలో
ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము
ద్వేషించకుంటే మాత్రమే ద్వేషాన్ని నివరించగలం
ఇది ఎప్పటికీ వర్తించే సూత్రం
14. మీ జీవితానికి ప్రశాంతత అయినా
మనశ్శాంతి అయినా
మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది
15. కోపంగా ఉండటమంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడంలాంటిది
దాన్ని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది