Monsoon Safety Tips: వర్షాకాలంలో హానిమూన్ వెళుతున్నారా? ఈ విషయంలో జాగ్రత్త!
Monsoon Safety Tips: రుతుపవనాలు ప్రారంభమైన వెంటనే వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. అలాంటి సమయాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వర్షకాలంలో ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆరోగ్య సంరక్షణ చిట్కాలను పాటించాలి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాతావరణం అహ్లదకరంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోంది. ఈ వాతావరణాన్ని మరింతగా ఎంజాయ్ చేయాలని చాలా మంది న్యూ కపుల్స్ హనీమూన్ ప్లాన్(Honeymoon plan) చేసుకుంటారు. అయితే వర్షాలు పచ్చదనంతో పాటు రోగాలను తీసుకువస్తాయి. వర్షాకాలంలో బయటికి వెళ్లేటప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇంట్లోనే ఉన్న కూడా రోగాల ముప్పు మాత్రం తగ్గడం లేదు. మరి అలాంటి సమయంలో హనీమూన్ వెళ్ళిన జంటలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళిన ప్రదేశంలో ఆనందంగా గడసాలంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వర్షాకాలంలో సురక్షితంగా ఉండటానికి సేఫ్టీ చిట్కాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి తగినంత తీసుకోవడం
వర్షాకాలంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి మీరోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో పాటు, ఇది జలుబును నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.
గోళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి
వర్షాకాలంలో గోళ్ళ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. గోళ్ళలో ఇరుక్కుపోయిన మురికి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గోర్లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మిమ్మల్ని మీరు శుభ్రం ఉంచుకోవడం, మీ చేతులను తరచుగా కడుక్కోండి, వీలైతే హ్యాండ్ శానిటైజర్‌ని మీతో తీసుకెళ్లండి
వర్షాకాలంలో తడిసిన తర్వాత స్నానం చేయండి
వర్షాకాలంలో రూం నుండి బయటకి అడుగు పెట్టగానే తరచూ తడిసిపోతుంటాం. అలాంటి సమయాల్లో ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. శుభ్రమైన నీటితో స్నానం చేస్తే శరీరం మొత్తం పొడిగా ఉంటుంది.
బయట తినడం మానుకోండి
వర్షాకాలంలో ప్రదేశాలన్ని జలమయమవుతుంది. ఇలాంటి సమయంలో ఈగలు, దోమల బెడద ఎక్కువవుతుంది. ఈ కారణంగా , వీధుల్లో దొరికే ఆహారాన్ని తినడం మానుకోవాలి. వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కానీ ఈ వాతావరణంలో వాటి బయట వాటిని ట్రై చేస్తే మాత్రం రోగాలు పక్కా.
వేడి ఆహారాన్ని తినండి
వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారుతుంది . అలాంటి సమయాల్లో వేడి వేడిగా ఏదైనా తినాలనుకుంటే సూప్, వేడి పాలు లేదా అల్లం టీ తాగవచ్చు. ఇది రుచితో పాటు మంచి అనుభూతి ఇస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
తడిసిన బట్టలను ఆరబెట్టండి
మీరు వర్షంలో తడిసిన బట్టలను అలానే ఉంచుకుని కూర్చోవద్దు. వాటిని ఆరబెట్టాలి. లేకపోతే జలుబు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. వాటికి బదులుగా పొడి బట్టలు వేసుకోవాలి.
ఆహారం పట్ల శ్రద్ధ వహించండి
మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఈ వాతావరణంలో ఎక్కువగా తినడం కాకుండా తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. తక్కువగా తినడానికి ప్రయత్నించండి. ఆహారాన్ని తయారు చేసేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇల్లు మొత్తం సాధారణం కంటే ఎక్కువగా శుభ్రం చేయాలి. రూం కీటకాలను మూసి ఉంచండి
హెర్బల్ టీలు, పానీయాలు తాగుతూ ఉండండి
సాధారణ టీలు, సూప్‌లు కాకుండా, హెర్బల్ టీలు కూడా ఈ వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటాయి. లవంగాలు, పసుపు, తులసి, అల్లం, కుంకుమపువ్వుతో చేసిన ద్రవాలను త్రాగాలి. ఇది మీ శరీరంలో ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. దీనితో పాటు, మీ రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా గొడుగు, రెయిన్ కోట్ పెట్టుకోవాలి
వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షం ఎప్పుడైనా రావచ్చు. అటువంటి సమయంలో, సేప్టిగా ఉండడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ గొడుగు లేదా రెయిన్ కోట్ తీసుకెళ్లండి. మీ తల తడిగా ఉండనివ్వండి.
అపరిశుభ్రమైన నీటికి దూరంగా ఉండండి
వర్షాకాలంలో నీటి కాలుష్యం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
సంబంధిత కథనం