Monkey Pox : మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. చేయవలసినా, చేయకూడనవి ఇవే..-health ministry lists do s and don ts for viral disease of monkey pox as india sees rise in cases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Health Ministry Lists Do's And Don'ts For Viral Disease Of Monkey Pox As India Sees Rise In Cases

Monkey Pox : మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. చేయవలసినా, చేయకూడనవి ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 03, 2022 01:58 PM IST

Monkeypox : భారతదేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ వైరల్ వ్యాధి పెరగకుండా ఉండాలంటే.. కొన్ని చేయవలసిన, చేయకూడని వాటిని సూచించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంకీపాక్స్ నిబంధనలు
మంకీపాక్స్ నిబంధనలు

Monkeypox : కరోనా భయం తగ్గిందిరా బాబు అనుకుంటుంటే.. మంకీపాక్స్ నేనున్నా అంటూ వచ్చేసింది. ప్రస్తుతం ఈ వైరల్ వ్యాధి భారత్​లో విస్తరిస్తూనే ఉంది. ఈ వైరల్ జూనోటిక్ వ్యాధి.. మశూచికి సమానమైన లక్షణాలు కలిగి ఉంది. అయినప్పటికీ తక్కువ క్లినికల్ తీవ్రతతో ఉంటుంది. మంకీపాక్స్ (MPX) మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉంచిన కోతులలో కనుగొన్నారు. అందుకే దీనికి 'Monkeypox' అని పేరు వచ్చింది.

తాజాగా భారతదేశంలో మంకీపాక్స్ కేసులు ఎనిమిదికి పెరిగాయి. దిల్లీ, కేరళలో ఒక్కొక్క రోగిని గుర్తించారు. కేసులు పెరుగుతున్నక్రమంలో వైరల్ మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని చేయవలసినా, చేయకూడని అంశాలు జారీ చేసింది.

రాజ్యసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మంకీపాక్స్​ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల చైతన్యం రావడం చాలా అవసరమన్నారు. భారత ప్రభుత్వం తరపున NITI ఆయోగ్ సభ్యుని అధ్యక్షతన ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అయితే చేయవలసినా, చేయకూడనవి ఏంటి?

* వ్యాధి సోకిన వ్యక్తిని ఇతరుల నుంచి వేరుగా ఉంచాలి. తద్వారా వ్యాధి వ్యాపించదు.

* ఎలాంటి పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు.

* మీకు వ్యాధి లక్షణాలు ఉంటే.. బయటకు వెళ్లడం, పబ్లిక్ మీటింగ్​లకు అటెండ్ కావడం మానేయండి.

* హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించాలి. లేదా మీ చేతులను సబ్బుతో కడగాలి.

* రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ నోటిని మాస్క్‌తో, చేతులను డిస్పోజబుల్ గ్లోవ్స్‌తో కప్పుకోవాలి.

* మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించాలి.

* మంకీపాక్స్​కు సంబంధించిన పాజిటివ్ పరీక్షలు చేసిన వ్యక్తులతో పరుపులు, బట్టలు, తువ్వాలు మొదలైన వాటిని పంచుకోవడం మానుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్