Glaucoma Awareness Month: గ్లాకోమా గురించి ఇవి తెలిస్తే మీ కంటి చూపు భద్రం
Glaucoma Awareness Month: గ్లాకోమా వస్తే శాశ్వతంగా మీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ముందే గుర్తిస్తే మీ కంటిచూపును కాపాడుకున్నవారవుతారు. అందుకే మీరు చేయాల్సిందిదే.
గ్లాకోమాకంటి జబ్బుల సమ్మేళనం. ఇది క్రమంగా పెరుగుతూ కంటిలోని ఆప్టిక్ నరాల (మెదుడుకు కంటికి మధ్య ఉన్న లింక్) ను దెబ్బతీస్తుంది. గ్లాకోమా తొలుత మీ చూపు పరిమితమవుతుంది. అంతిమంగా పూర్తిగా అంధత్వాన్ని కలుగజేస్తుంది. గ్లాకోమా వల్ల వచ్చే అంధత్వానికి చికిత్స అందకపోతే ఇక మీ చూపు రాకపోవచ్చు. ఎందుకంటే ఆప్టిక్ నాడీ ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. కాటరాక్ట్ వంటి విషయాల్లో చూపు తిరిగి వస్తుంది. కానీ గ్లోకోమా విషయంలో పూర్తిగా చూపు కోల్పోతే దానిని పునరుద్ధరణ కష్టమవుతుంది.
‘గ్లాకోమాఎవరినైనా ప్రభావితం చేయొచ్చు. వృద్ధాప్యం వచ్చే సరికి ఈ ముప్పు పెరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కుటుంబ సభ్యులను ఎక్కువ ప్రభావితం చేయవచ్చు. గతంలో ఏవైనా కంటి సంబంధిత గాయాలు ఉంటే కూడా ముప్పు ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం, ఎక్కువ కాలం స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ వాడడం వంటి వల్ల కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందని సైట్ సేవర్స్ ఇండియా ఐ హెల్త్ టిక్నికల్ లీడ్ డాక్టర్ సందీప్ బుటాన్ వివరించారు.
‘గ్లాకోమా వంశపారంపర్యంగా రావొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబంలో కంటి జబ్బులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాఖలాలు ఎక్కువగా ఉంటే తరచుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఉన్నప్పుడు సోదరులు, సోదరీమణులు, పిల్లలు కంటి పరీక్షలు చేయించుకోవాలి..’ అని డాక్టర్ సూచించారు.
గ్లాకోమాలక్షణాల గురించి డాక్టర్ సందీప్ వివరించారు. ‘గ్లాకోమా వచ్చిన తొలి రోజుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. తలనొప్పి, కంట్లో నీరు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. లేదా ఈ లక్షణాలు అసలే కనిపించకపోవచ్చు. లక్షణాలతో సంబంధం లేకుండా 40 ఏళ్ల వయస్సు వచ్చిన వారు ఏడాదికోసారి గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలి. గ్లోకోమాకు చికిత్సలో భాగంగా కంటి చుక్కల మందు, లేజర్ థెరపీ, కంట్లో సర్జరీ, లేదా ఇవన్నీ కలగలిపి ఇస్తారు. గ్లోకోమా కండిషన్, స్టేజ్‌ను బట్టి చికిత్సా విధానం ఉంటుంది. ఇది తీవ్రమైన సమస్య అయినందున జీవితకాలం దీనిని పర్యవేక్షిస్తుండాలి. గ్లోకోమాలో ఉన్న చికిత్సలన్నీ ప్రాథమికంగా ఆప్టిక్ నరం దెబ్బతినకుండా చూసేందుకు ఉద్దేశించినవే. అప్పటివరకు అయిన నష్టాన్ని పూడ్చలేరు..’ అని డాక్టర్ వివరించారు.
గ్లాకోమాను త్వరితగతిన గుర్తించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను డాక్టర్ వివరించారు. ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే కంటి చూపు కోల్పోకుండా చూడొచ్చు. లేదా గ్లోకోమా వేగంగా మీ కంటిచూపును దెబ్బతీయకుండా చూడొచ్చు.
1. Have a routine, extensive eye exam: క్రమం తప్పకుండా గ్లాకోమా పరీక్షలు
క్రమం తప్పకుండా పూర్తిస్థాయిలో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎర్లీ స్టేజ్‌లో గ్లాకోమాను కనిపెట్టవచ్చు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు వస్తే తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి. కనీసం ఐదేళ్లకోసారి కంటి సంబంధిత అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ మీరు 40 నుంచి 54 ఏళ్ల మధ్యలో ఉంటే ప్రతి రెండేళ్లకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. 55 నుంచి 64 ఏళ్ల మధ్య ఉంటే ప్రతి ఏడాది రెండేళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలి. 65 ఏళ్ల పైన ఉంటే ఏటా పరీక్ష చేయించుకోవాలి. గ్లాకోమా ముప్పు ఉంటే ఇంకా ఎక్కువసార్లు పరీక్షలు చేయించుకోవాలి.
2. eye disease in your family: ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి గ్లాకోమా పరీక్ష తప్పనిసరి
గ్లాకోమా వంశపారంపర్యంగా రావొచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా గ్లోకోమా హిస్టరీ ఉన్నప్పుడు మీరు తరచుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. మిగిలిన కుటుంబ సభ్యులు గ్లోకోమా పరీక్షలు చేయించుకుంటే ఎర్లీ స్టేజ్‌లో గుర్తించవచ్చు.
3. eyedrops as prescribed: కంటి చుక్కల మందు క్రమం తప్పకవాడాలి
కంట్లో ఒత్తిడి గ్లోకోమాగా అభివృద్ధి చెందవచ్చు. దానిని గ్లాకోమా కంటి చుక్కల మందుతో కట్టడి చేయవచ్చు. మీకు లక్షణాలు లేకపోయినా మీ వైద్యుడు సూచించిన చుక్కల మందు క్రమం తప్పకుండా వాడాలి. అలాగే గ్లోకోమా ముప్పు ఉన్న వారు సమయానుసారం ఈ జబ్బు మరింత వృద్ధి చెందకుండా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఇతర జబ్బులకు సంబంధించి మందులు వాడుతున్నటయితే మీ వైద్యడికి ఆ వివరాలు చెప్పాలి.
4. Avoid using over-the-counter eye drops: ఓటీసీ చుక్కల మందు వద్దు
మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ లేకుండా కౌంటర్‌పై దొరికే మందులు, కంటి చుక్కల మందులు వాడొద్దు. ముందుగా కంటి వైద్యుడిని సంప్రదించి వారు సూచించిన చుక్కల మందునే వాడాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ కాలం తీసుకుంటే కంట్లో ఒత్తిడి పెరగొచ్చు.
5. Always use eye protection: కళ్లను రక్షించుకోండి
కళ్లు ఏదైనా కారణంతో దెబ్బతిన్నప్పుడు గ్లాకోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఆటలు ఆడుతున్నప్పుడు దెబ్బ తాకే ప్రమాదం ఉండే సందర్భాల్లో కంటికి రక్షణ సాధనాలు వాడాలి. అలాగే పని ప్రదేశాల్లో కూడా కళ్లకు హాని కలిగే పరిస్థితి ఉంటే రక్షణ సాధనాలు వాడాలి.