10 Kgs In 30 Days : 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గే ఆహారాలు.. ఇక మెుదలెడదామా?-follow these weight loss diet to lose 10 kgs in 30 days know in details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  10 Kgs In 30 Days : 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గే ఆహారాలు.. ఇక మెుదలెడదామా?

10 Kgs In 30 Days : 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గే ఆహారాలు.. ఇక మెుదలెడదామా?

Anand Sai HT Telugu
Oct 21, 2023 10:30 AM IST

Weight Loss Diet : కొందరు బరువు తగ్గేందుకు చేయని పని అంటూ ఉండదు. మార్కెట్లోని ప్రోడక్ట్స్ వాడి వాడి.. విసుగు వచ్చేస్తుంది. ఇంట్లోనే తీసుకునే ఆహారంతో కూడా మీ బరువు తగ్గించుకోవచ్చు. అదేలాగో చూద్దాం..

బరువు తగ్గేందుకు చిట్కాలు
బరువు తగ్గేందుకు చిట్కాలు (unsplash)

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? జిమ్‌కి వెళ్లి తీవ్రమైన వ్యాయామం చేస్తున్నారా? అయినా బరువు తగ్గడం లేదని బాధపడుతూ ఉండొచ్చు. బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు. దానితో పాటు తినే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి.

ఆహారాలు బరువు పెరగడానికి ప్రధాన కారణం అయినప్పటికీ, అదే ఆహారాల సహాయంతో బరువును కూడా తగ్గొచ్చు. అందుకు తగిన ఆహారపదార్థాలను ఎంచుకుని తినాలి. మీరు ఊబకాయంతో బాధపడుతుంటే బరువు తగ్గే ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే ఊబకాయం టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. బొద్దుగా ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అధిక బరువును వేగంగా కోల్పోవడం కష్టం. కానీ మీరు ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాన్ని అనుసరిస్తే, కచ్చితంగా, సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

అల్పాహారం

బెర్రీలు, గింజలతో కలిపిన ఓట్స్

సాంబార్, చట్నీతో ఇడ్లీ లేదా దోసె

కూరగాయలు, పెరుగుతో బ్రేక్ ఫాస్ట్

అల్పాహారం కోసం వీటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

మధ్యాహ్న భోజనం

అన్నం, కూరగాయలతో దాల్

చికెన్ లేదా ఫిష్ గ్రేవీ, చపాతీతో కూరగాయలు

కూరగాయలు, ఫెటా చీజ్‌తో కూడిన మిల్లెట్ సలాడ్

మధ్యాహ్న భోజనం కోసం వీటిలో ఒకదాన్ని ఎంచుకోండి.

స్నాక్స్

తాజా సీజనల్ పండ్లు

క్యారెట్, దోసకాయ వంటి కూరగాయలు

గింజలు

డిన్నర్

కూరగాయలు, పెరుగుతో ఖిచ్డీ

కాల్చిన చేపలు

అన్నంతో టోఫు గ్రేవీ

డిన్నర్ కోసం వీటిలో ఒకదాన్ని ఎంచుకోండి.

మంచి, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడమే కాకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అది కూడా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు మోడరేట్ నుంచి హై ఇంటెన్సిటీ వ్యాయామం చేయాలి.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకుని తినండి. ఇలా తీసుకుంటే చాలా సేపు కడుపు నిండుతుంది. ఫైబర్స్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలో కనిపిస్తాయి. బరువు తగ్గడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ తగినంత ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కండరాలను బలంగా, కొవ్వు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

ఒత్తిడి లేకుండా మనసును రిలాక్స్‌గా ఉంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే అధిక ఒత్తిడి వల్ల శరీరంలో స్థూలకాయాన్ని పెంచే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనస్సును రిలాక్స్‌గా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా మొదలైన వాటిలో నిమగ్నమై ఉండాలి.

WhatsApp channel