Sex Life | మొదటిసారి సెక్స్‌లో పాల్గొంటున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే
సెక్స్ అనేది ప్రకృతిలో ఓ భాగం. దీనిని చాలా మంది తప్పుగా చూడటం వల్ల చిన్ననాటి నుంచి అందరిలోనూ అలాంటి తప్పుడుభావనే మదిలో మెదులుతూ ఉంటుంది. మొదటిసారి భాగస్వామితో కలవాలి అంటే అందరికీ కొంచెం భయం, సంకోచం వంటివి ఉంటాయి. కానీ ఈ ఐదు చిట్కాలు పాటిస్తే.. మీ మొదటి కలకయికను ఆనందంగా అనుభవించగలరు అంటున్నారు సెక్స్ ఎడ్యుకేటర్ డాక్టర్ తనయ.
సెక్స్ విజ్ఞానం మనిషికి చాలా అవసరం. ఓ మంచి దాపత్య జీవితం కొనసాగించాలన్నా.. దానిని ఎంజాయ్ చేయాలన్నా దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మొదటిసారి భాగస్వామితో కలవాలి అంటే.. ఎంతో మందికి ఈ విధమైన భావన, భయం ఉంటుంది. అందుకే దీనిపై అవగాహన ఉండాలి అంటుంది సెక్స్ ఎడ్యుకేటర్ డాక్టర్ తనయ. ఈ రకమైన భావనలకు ప్రధాన కారణం మనలోని అనుమానాలు, అపోహలేనని తేల్చిచెప్పారు. అలా కాకుండా ఈ ఐదు చిట్కాలను పాటిస్తే.. మొదటి కలయికలో మంచి అనుభూతిని పొందగలరంటూ సూచనలు ఇచ్చారు.
మాటలు కలవాల్సిందే (Communication)
మీరు మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మీ భాగస్వామితో మంచిగా మాట్లాడండి. ఇది చాలా ముఖ్యమైనది. మొదటిసారి సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఉండే అనుభూతి, భయం, రకరకాల ఫీలింగ్స్ అన్ని వారితో చెప్తే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే వీలుంటుంది. జరిగేది మొదటిసారి కాబట్టి ఎలా జరిగినా దానిని అర్థం చేసుకోవాలి. ఇలా అందరికీ జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
ఆందోళన వద్దు (Anxiety Relief)
ముందుగా ఆందోళనను తగ్గించుకోండి. తొలిసారి కలవడం కాబట్టి.. ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన తప్పనిసరిగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవడం కోసం మొదటిదానినే ఫాలో అవ్వండి. అంటే భాగస్వామితో మాట్లాడండి. ఇదేమి థియేటర్ పర్ఫార్మెన్స్ కాదని తెలుసుకోండి. అందరికీ 5 స్టార్ రేటింగే వస్తుందని రూల్ ఏమి లేదనే విషయం దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
బాధ లేదా నొప్పి (Pain and Penetrations)
మొదటిసారి సెక్స్ అనుభవిస్తున్నప్పుడు ఇలాంటి నొప్పి అనేది సహజం. కాని అంగాన్ని చొప్పించడం వల్ల భరించలేని నొప్పి వస్తే మాత్రం ఫోర్ ప్లేని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీ భాగస్వామితో రోమాన్స్ చేసే సమయం పెరుగుతుంది. దీని వల్ల యోని మార్గంలో స్రావాలు పెరగడమే కాకుండా ఆందోళన తగ్గి.. నొప్పి తెలియకుండా ఉంటుంది.
సేఫ్టీ వాడండి(Use Condoms)
మొదటిసారి భాగస్వామిని కలిసినప్పుడు.. కండోమ్స్ వాడండి. లేదంటే ఎస్టీఐ, ఎస్డీఐ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి బారిన పడకుండా ఉండాలంటే సేఫ్టీ వాడండి.
ఎంజాయ్ చేయండి( Have Fun)
ఆ పని ఏదో యుద్ధంలా, లేకుంటే ఓ పనిలా కాకుండా ఎంజాయ్ చేస్తూ సెక్స్ లో పాల్గొనండి. మీరు మంచి అనుభూతి పొందుతారు.
సంబంధిత కథనం