Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఎన్ని ‘m’ అక్షరాలు ఉన్నాయో 10 సెకన్లలో కనిపెట్టండి, ఎలన్ మస్క్ విసిరిన సవాలు ఇది-find out how many m letters are in this optical illusion in 10 seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఎన్ని ‘M’ అక్షరాలు ఉన్నాయో 10 సెకన్లలో కనిపెట్టండి, ఎలన్ మస్క్ విసిరిన సవాలు ఇది

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఎన్ని ‘m’ అక్షరాలు ఉన్నాయో 10 సెకన్లలో కనిపెట్టండి, ఎలన్ మస్క్ విసిరిన సవాలు ఇది

Haritha Chappa HT Telugu
Mar 19, 2024 12:30 PM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఇష్టపడే వారికి మరొక సవాల్ వచ్చేసింది. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో కేవలం 10 సెకన్లలో ఎన్ని ‘m’ ఉన్నాయో కనిపెట్టండి.

Optical Illusion
Optical Illusion

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఎలన్ మస్క్ కూడా ఒకరు. అతను ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు పరిష్కరిస్తూ ఉంటారు. అతని అనుచరులైన కొంతమంది ఎలన్ మస్క్ పేరుతో ఎక్స్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో ఒక ఆప్టికల్ ఇల్యూషన్‌ను పోస్ట్ చేశారు. ఇందులో ఎన్ని ‘m’లు ఉన్నాయో కనిపెట్టడమే మీ పని.

జవాబును కేవలం 10 సెకన్లలో కనిపెట్టి చెప్పాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. పది సెకన్లలో కనిపెట్టిన వారే తోపు. మీ పరిశీలనా నైపుణ్యాలు చురుగ్గా ఉంటే, మీ ఐక్యూ పదునైనది అయితే... మీరు 10 సెకన్లలోనే ఎన్ని ఆంగ్ల అక్షరాలు ‘m’ లు ఉన్నాయో చెప్పేస్తారు.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

టైమర్ ఆన్ చేసుకుని 10 సెకన్లలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను చేధించడానికి ప్రయత్నించండి. జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు విషయానికి వస్తే ఈ ఆప్టికల్ ఇల్యుషన్లు 8 ‘m’ లు ఉన్నాయి. మీకు లెక్క సరిపోవడం లేదా? ఏడు ‘m’ లు ఫోటోలోని ‘n’ల పక్కన ఉంటే, ఒక m మాత్రం ప్రశ్నలో ఉంది. దాన్ని కూడా కలుపుకొని మీరు చెప్పాలి. అప్పుడే మీ ఐక్యూ పదునైనదని ఒప్పుకుంటాం.

చాలామంది n పక్కన ఉన్న ‘m’ లను మాత్రమే లెక్కిస్తారు. కాబట్టి దాన్ని కూడా లెక్కించి చెప్పాలి. అయితే ప్రశ్నలో How many అనే పదంలో కూడా m ఉంది. అది మాత్రం లెక్కించకండి. కేవలం బ్రాకెట్లో ఉన్న m ను మాత్రమే లెక్కించి చెప్పాలి. పదాలలో ఉన్న mను లెక్కించకండి, అక్షర రూపంలో ఉన్న mను మాత్రమే లెక్కించండి. అలాంటి అక్షర రూపంలో ఉన్న mలు ఎన్ని ఉన్నాయో లెక్కించడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్.

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కాస్త గజిబిజిగా ఉండవచ్చు. కానీ తెలివిగా ఆలోచించే వారికి ఇది చాలా సింపుల్. ఇలాంటివి ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మీకు ఆసక్తిగా అనిపిస్తే వాటిని ప్రతిరోజూ సాల్వ్ చేస్తూ ఉండండి. ఇది మీ మెదడును చురుకుగా మారుస్తుంది. కళ్ళు పదునుగా పనిచేసేలా చేస్తుంది. మీ ఐక్యూ లెవెల్స్ ని కూడా పెంచుతుంది.

టాపిక్