తక్కువ ధరకే Vivo Y01 స్మార్ట్‌ఫోన్.. బ్యాటరీ బ్యాకప్ ప్రధాన ఆకర్షణ!
మొబైల్ తయారీదారు వివో తాజాగా Vivo Y01 అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్లు, ధర ఇక్కడ తెలుసుకోండి.
మొబైల్ తయారీదారు వివో వరుసగా కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా Vivo Y01 అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ ఫోన్, దీని ధర రూ. 10 వేల లోపే ఉంది. ఇందులో సమర్థవంతమైన మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో పాటు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండే 5000 mAh కెపాసిటీగల మెరుగైన బ్యాటరీ రావడం ప్రధాన ఆకర్షణలుగా చెప్పవచ్చు.
సరికొత్త Vivo Y01 స్మార్ట్‌ఫోన్ ఎలిగెంట్ బ్లాక్, సఫైర్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతోంది. మార్కెట్లో అందుబాటు ధరల్లో లభిస్తున్న Redmi 10A, Samsung Galaxy M02 వంటి స్మార్ట్‌ఫోన్లకు పోటీగా వివో ఈ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.
ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Vivo Y01 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 2GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ Helio P35 ప్రాసెసర్
- వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
- ధర, రూ. 8,999/-
కనెక్టివిటీ పరంగా చూస్తే Vivo Y01లో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS , మైక్రో-USB పోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్ Vivo e-స్టోర్ అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం