పీరియడ్స్ తప్పిపోవడమే కాకుండా.. ఈ లక్షణాలు కూడా ప్రెగ్నెన్సీకి సంకేతాలు!-early pregnancy symptoms before a missed period ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పీరియడ్స్ తప్పిపోవడమే కాకుండా.. ఈ లక్షణాలు కూడా ప్రెగ్నెన్సీకి సంకేతాలు!

పీరియడ్స్ తప్పిపోవడమే కాకుండా.. ఈ లక్షణాలు కూడా ప్రెగ్నెన్సీకి సంకేతాలు!

HT Telugu Desk HT Telugu
Apr 28, 2022 11:58 PM IST

సాధారణంగా పీరియడ్స్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీని గుర్తిస్తారు. ఇదే కాకుండా ఇతర లక్షణాలు కూడా ప్రెగ్నెన్సీకి సంకేతాలుగా ఉంటాయి.

pregnancy test
pregnancy test

ప్రతి స్త్రీకి గర్భధారణ సమయం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో, మహిళలు తమకు తాముగా ఎక్కువగా కెరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు ఉంటాయి. గర్భం దాల్చిన నుండి ప్రసవం వరకు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీ గర్భం దాల్చిన విషయం శరీరంలో వచ్చే వివిధ మార్పుల ద్వారా తెలుస్తోంది. గర్భధారణ సమయంలో స్త్రీలందరూ ఒకే విధమైన లక్షణాలను ఉండవలసిన అవసరం లేదు.

సాధారణంగా పీరియడ్స్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీని గుర్తిస్తారు, అయితే కొంతమంది స్త్రీలలో గర్భం దాల్చినప్పుడు శరీరంలో ఇతర లక్షణాలు ఉండవచ్చు. అలాంటి లక్షణాలెంటో ఇప్పుడు చూద్దాం.

మార్నింగ్ సిక్‌నెస్- గర్భం ప్రారంభంలో, మహిళలు ఉదయం లేవగానే వాంతులు సమస్య ఉంటుంది. చాలా మంది మహిళలు తమ పీరియడ్స్ మిస్ అయిన తర్వాత ఈ సమస్యను ఎదురవుతుంది. ఉదయం పూట మాత్రమే కాకుండా రోజులో ఎప్పుడైనా వాంతలు కావచ్చు. గర్భం దాల్చిన కొన్ని వారాల తర్వాత కనిపించే సిమ్టమ్ ఇది. శరీరంలో ఈస్ట్రోజెన్,ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల ఇది జరుగుతుంది.

రొమ్ములో మార్పులు- గర్భం ప్రారంభ వారాలలో, స్త్రీలు రొమ్ము పరిమాణం, ఆకృతిలో మార్పులను చూడవచ్చు. ఈ సమయంలో, స్త్రీలు తమ రొమ్ములు బరువుగా,వాపుగా అనిపించవచ్చు. ఇది ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (PMS) లక్షణాలను పోలి ఉంటుంది. సాధారణంగా, రెగ్యులర్ పీరియడ్స్ సమయంలో, మహిళల చనుమొనల రంగు నల్లబడదు రొమ్ము పరిమాణంలో తేడా ఉండదు, కానీ గర్భధారణ సమయంలో ఇందులో మార్పు ఉంటుంది.

అలసట- గర్భం ప్రారంభ కాలంలో మహిళలు చాలా అలసిపోతారు. గర్భధారణ సమయంలో, శారీరక, మానసిక స్థితిపై హార్మోన్ల ప్రభావం ఉంటుంది. దాని కారణంగా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది.

 

బ్లీడింగ్ , తిమ్మిర్లు- గర్భం ప్రారంభ దశలలో బ్లీడింగ్ ఉంటుంది. దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని కూడా అంటారు. ఇది లేత గులాబీ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు. పీరియడ్స్ ప్రారంభానికి ఒక వారం లేదా రెండు వారాల ముందు ఇది కనిపించవచ్చు. ఇది జరిగినప్పుడు మహిళలు భయపడకూడదు, ఎందుకంటే ఫలదీకరణం తర్వాత అండాలు గర్భాశయం లైనింగ్‌తో జతచేయబడుతుంది, దీని వల్ల చికాకు లేదా తేలికపాటి రక్తస్రావం కలిగిస్తుంది. దీనితో పాటు, ఈ సమయంలో మహిళలు కూడా తిమ్మిరిని ఎదుర్కోవలసి ఉంటుంది, ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. అంటే శరీరంతో పాటు గర్భాశయానికి రక్తప్రసరణ కూడా పెరిగి తిమ్మిరి అనుభూతిని కలిగిస్తుంది.

WhatsApp channel