Navaratri 2022: నవరాత్రులలో ఈ పొరపాట్లు చేయకండి.. లేకపోతే దేవి అనుగ్రహం ఉండదు
నవరాత్రి పర్వదినం మొదలైంది 9 రోజుల పాటు ఉత్సవములు మీరు కొన్ని పొరపాట్లు చేస్తే దుర్గామాత అనుగ్రహం ఉండదు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం.
నవరాత్రులు (Navratri 2022) సెప్టెంబరు 26 నుండి ప్రారంభమయ్యాయి. తదుపరి తొమ్మిది రోజులు, అమ్మవారి తొమ్మిది వివిధ రూపాలను పూజిస్తారు. దుర్గామాత అరాధనలో ఉంటారు . నవరాత్రి 9 రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. నవరాత్రుల ఈ తొమ్మిది రోజులలో, కొన్ని నియమాలు తప్పక పాటించాలి. (నవరాత్రి నియమాలు) . ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు, ఉపవాసాలు చేస్తారు. అయితే ఈ 9 రోజులలో మీరు కొన్ని పొరపాట్లు చేస్తే దుర్గామాత అనుగ్రహం ఉండదు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం.
నవరాత్రులలో ఈ తప్పులు చేయకండి –
దుర్గా ఆశీర్వాదం ఉంటే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అపారమైన ఆనందం, శ్రేయస్సు పొందుతారు. మీరు కూడా నవరాత్రులలో దుర్గామాత ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే, మీరు పొరపాటున ఈ క్రింది పనులను చేయకూడదు. ఈ పనులు ఏమిటో తెలుసుకోండి..
మీరు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి, అఖండ జ్యోతిని వెలిగిస్తే, అది ఎప్పుడూ వెలిగేలా చూసుకోండి. దానిని ఖాళీగా ఉంచవద్దు. ఎవరొక్కరూ దానిని చూసుకుంటూ ఉండడం తప్పనిసరి
నవరాత్రులలో ఘటస్థానం చేయడం అంటే దుర్గామాతని తన ఇంటికి ఆహ్వానించడమే. దేవి అనుగ్రహాం పొందాలంటే, పూజ, ఆరతి ఉదయం, సాయంత్రం చేయాలి. అలాగే సాత్విక భోజనం చేయకపోతే దుర్గామాత మనస్తాపం చెందవచ్చు.
ఈ సమయంలో ఇంటో ఎలాంటి మాంసాహారాలను వండకూడదు. వంటి గదిలో పరిశుభ్రతను నిర్వహించండి. ఇంట్లో వెల్లుల్లి-ఉల్లిపాయ వంటకాలను వండకండి . లేకపోతే ఈ పొరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది.
- నవరాత్రుల తొమ్మిది రోజులలో జుట్టు, గోర్లు కత్తిరించవద్దు. క్షవరం చేయవద్దు. పూజా సమయంలో తోలు వస్తువులు ధరించవద్దు. తొమ్మిది రోజుల పాటు నల్లని బట్టలు మరియు లెదర్ షూస్, పర్సులు, బెల్టులకు దూరంగా ఉండటం మంచిది.
నవరాత్రుల మొదటి రోజు నుండి దసరా వరకు ఉన్న ఉత్సాహంలో స్పృహ కోల్పోకండి ఉండాలని ఎలాంటి మందులు తీసుకోకండి.
- నవరాత్రులలో ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు తీసుకురాకండి. ఏ స్త్రీల పట్ల గౌరవంతో ఉండాలి.
సంబంధిత కథనం