Drumstick Pickle: మునక్కాయలతో స్పైసీ పచ్చడి రెసిపీ, ఆరు నెలల పాటూ నిల్వ ఉంటుంది
Drumstick Pickle: మునక్కాయ టమాటా కూర అంటే ఎంతో మందికి ఇష్టం. మునక్కాయలతో చేసిన వంటకాలు ఏవైనా టేస్టీగా ఉంటాయి. ఓసారి మునక్కాయ పికిల్ చేసుకుని చూడండి. ఇది మీకు నచ్చడం ఖాయం.

Drumstick Pickle: మునక్కాయలు అన్ని సీజన్లోనూ లభిస్తాయి. ఇవి కూరల్లో వేసుకుని తింటే ఆ రుచేవారు. సాంబార్లో మునక్కాయ లేనిదే టేస్టే ఉండదు. మునక్కాయలతో ఎప్పుడూ ఒకేలాంటి కూరలు కాకుండా ఓసారి స్పైసీ పికిల్ ట్రై చేయండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. మునక్కాయతో చేసే ఈ ఊరగాయను ఆరు నెలలకు పైగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో వేసుకుని తినొచ్చు. మునక్కాయ కూరతో పోలిస్తే ఈ మునక్కాయ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సులువుగా చేసేయొచ్చు. ఈ మునక్కాయ పచ్చడి రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మునక్కాయ పికిల్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మునక్కాయలు - ఐదు
మెంతులు - ఒక స్పూను
పల్లీ నూనె - ఒక కప్పు
చింతపండు - నిమ్మకాయ సైజులో
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర కప్పు
ఆవాలు - ఒక స్పూను
మునక్కాయ పికిల్ రెసిపీ
1. మునక్కాయలను శుభ్రంగా కడిగి తడి తుడిచేయాలి.
2. తరువాత వాటిపై ఉన్న పొట్టును తీసేయాలి. ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు, ఆవాలు వేయించి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
4. అందులో చింతపండును వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5.ఇప్పుడు ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.
6. ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
7. నూనె వేడెక్కాక మునక్కాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
8. మునక్కాయల వేగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
9. నూనె కాస్త చల్లారాక అందులో కారం, ఉప్పు వేసి కలపాలి.
10. తర్వాత ముందుగా పట్టుకున్న మసాలా పొడిని వేసి కలపాలి. అలాగే పసుపును కూడా వేయాలి.
11. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టాలి.
12. నాలుగు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తరువాత ఒక గాజు సీసాలో వేసి మూత పెట్టాలి.
13. రెండు రోజులపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత మునక్కాయ పికిల్ రెడీ అయినట్టే.
14. ఇది బాగా ఊరి టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ మునక్కాయ పికిల్ ను ఒక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకొని తింటే ఆ రుచే వేరు.
మునక్కాయలు మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. దీనిలో ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. మునక్కాయలు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా మారడం వంటివి కనుమరుగవుతాయి. చిన్నారులకు, వృద్ధులకు మునక్కాడలు పెట్టడం చాలా అవసరం. వారికి ఐరన్, క్యాల్షియం ఎక్కువ అవసరం పడుతుంది. మునక్కాడల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఆర్థరైటిస్ వంటి రోగాలకు చికిత్స చేస్తాయి. కాబట్టి ఎవరైతే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారో వారు మునక్కాడలను తరచూ తింటే మంచిది. మునక్కాడలను కూరలుగా, సాంబార్లో లేదా ఇలా పికిల్ చేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి.
మునక్కాడ పికిల్‌లో మనం ఎక్కువగానే ఆవాలు వంటివి వాడాము. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. పల్లీ నూనె మనకి ఎంతో మేలు చేస్తుంది. రోజుకి రెండు ముద్దలు ఇలా మునక్కాడ పికిల్ తో తినేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. త