Dreams: మీ కలలో ఈ జంతువులు కనిపిస్తున్నాయా?అయితే భవిష్యత్తు తెలుసుకోవచ్చు
మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏవేవో కలలు వస్తుంటాయి. ఒక్కోసారి కలలో జంతువులు, పక్షులు కూడా వస్తుంటాయి. రాత్రి నిద్రలో వచ్చిన కలలు ఒక్కోసారి నిద్ర లేచాక గుర్తుండవు. ఏదో కల వచ్చిందని గుర్తు చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాం. లలు కొన్ని మంచిని సూచిస్తే... మరికొన్ని చెడును సూచిస్తాయి.
మనకి కలలో తెలుపు రంగు జంతువులు కనిపిస్తే ఎంతో శుభప్రదంగా పరిగణించాలి. శాస్త్రాల్లోనూ ఇలాంటి కలలు రావడం పవిత్రంగా పరిగణించారు. స్వప్నాల్లో వీటిని చూడటం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఏ జంతువు కనిపిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో, ఏయే అనుభవాలు ఎదురవుతాయో అని భయపడుతుంటాం. ఏ జంతువు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో జంతువులు కనిపిస్తే సంకేతాలు..
ఆవు:
కలలోకి వస్తే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆవు రూపం కలలో కనిపించిందంటే ఆ వ్యక్తికి దేవుడి పట్ల భక్తి ఎక్కువ.
పాము:
కలలో పాము కనిపించిందంటే భయపడిపోతుంటాం. కానీ, కలలో పాము కనిపిస్తే ఎలాంటి భయాలు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాము కనిపించడాన్ని శుభ శకునంగా చెబుతారు. పాము కలలో కనిపిస్తే జీవితంలో విజయం సాధిస్తామని అర్థం.
ఏనుగు:
మనలో చాలా మందికి ఏనుగు ఎక్కువగా కలలో కనిపిస్తుంటుంది. ఏనుగు కలలో కనిపిస్తే మంచిదే. ధన లాభం కలిగేందుకు సంకేతం. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. త్వరగా ధనవంతులు కాబోయేందుకు ఇది సంకేతం.
గుడ్ల గూబ:
కలలో గుడ్ల గూబ కనిపించినట్లయితే ధనం, ధాన్యం చేతికి వస్తుందట. గుడ్ల గూబను పలువురు దేవతల వాహనంగా భావిస్తారు. కలలోకి గుడ్ల గూబ వచ్చినట్లయితే లక్ష్మీ దేవి అనుగ్రహం లభించనుందని అర్థం.
జింక:
ఎప్పుడైనా కలలో జింక కనిపిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడటాన్నిసూచిస్తుంది. అదే జింక కలలో చనిపోయినట్లు కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుసుకోవాలి.
పిల్లి :
కలలో మీరు తెల్ల పిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని , నల్ల పిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించడానికి భయపడుతాన్నరని అర్ధం. అలాగే పిల్లిని తరుముతున్నట్లు వస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారని సూచిస్తుంది.
ఎద్దు:
కలలో ఎద్దు కనిపిస్తే పెద్ద మొత్తంలో సంపద రాబోతుందని అర్థం.
గాడిద:
ఒకవేళ ఎప్పుడైనా కలలో గాడిద కనిపించినట్లైతే చికాకులకు సంకేతం. ఏదైనా బరువు మోస్తున్న గాడిద కనిపించినట్లైతే ఎంతో కష్టపడితేనే విజయం దక్కుతుందని, గాడిద మీద ఊరేగుతున్నట్లు కనిపిస్తే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు తెలుసుకోవాలి.
మొసలి:
కలలో మొసలి కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతుందనే అర్థం. మొసలి కరిచినట్లు కల వస్తే వ్యాపారంలో నష్టం రావచ్చట.
కుందేలు:
పచ్చటి గడ్డిలో కుందేళ్లు ఆడుకుంటున్నట్లు కల వస్తే.. సంతానం వలన సంతోషం కలగబోతున్నట్లు. కుందేలు అదృష్టానికి గుర్తు. అంతా మంచి జరగబోతుందనే దానికి ఇది చిహ్నం.
తాబేలు:
కలలో తాబేలు వస్తే.. చేసే పనిలో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకా కష్టపడాలని అర్థం.
కుక్క:
కలలో కుక్క కనిపిస్తే మీ ప్రత్యర్ధి మీద మీరు విజయం సాధిస్తారని, అలాగే ఒక మంచి స్నేహితుడుని కోల్పోతున్నారని సూచిస్తుంది.
పంది:
పంది కనిపిస్తే మీరు స్వార్ధం లేదా అత్యాశతో అలోచిస్తున్నారని అర్ధం.
ఒంటె:
మీ కలలో ఒంటె కనిపిస్తే మీరు భారమైన సమస్యలను భుజాలపై మోస్తున్నారని అర్థం.
సంబంధిత కథనం