Things Avoid in Flight: విమాన ప్రయాణం చేయాల్సి వస్తే ఈ సింపుల్ వస్తువులు కూడా మీ దగ్గర ఉంచుకోకండి
Things Avoid in Flight: విమానంలో ప్రయాణించినప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. కొన్ని రకాల వస్తువులను పట్టుకుని వస్తే విమానాన్ని ఎక్కనివ్వరు. విమానంలో నిషేధించిన వస్తువులు ఏంటో తెలుసుకోండి .
Things Avoid in Flight: ఫ్లైట్ జర్నీ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఫ్లైట్ జర్నీ చేసే ముందు కొన్ని విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బస్సులో లేదా ట్రైన్లో ప్రయాణించినట్టు విమానంలో ప్రయాణించడం కుదరదు. విమానంలో ప్రయాణించడానికి ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను మీ దగ్గర ఉంచుకోకూడదు. మీ లగేజ్‌లలో వాటిని పెట్టకూడదు. అలా పెడితే మిమ్మల్ని విమానం ఎక్కనివ్వకుండా బయటికి పంపించేస్తారు. విమానాశ్రయ భద్రతా నిబంధనలు, విధానాలు కఠినంగా ఉంటాయి.
విమానంలో కొబ్బరికాయను తీసుకువెళ్లనివ్వరు. దీనికి మండే స్వభావం ఉంటుంది. అంటే ఏదైనా మంట ఉన్నప్పుడు కొబ్బరి పీచును వేస్తే అది మంటను మరింతగా పెంచుతుంది. దీన్నే మండే స్వభావం అంటారు. మీ హ్యాండ్ బ్యాగ్‌లోగానీ లేదా మీ సామాన్లలో కానీ ఎక్కడా కొబ్బరికాయలు ఉండకుండా చూసుకోండి. అందుకే విమానంలో వీటిని అనుమతించరు. కొబ్బరికాయతో పాటు అనేక రకాల ఆహారాలను పై నిషిద్ధం విధించారు.
పెరుగు కూడా
మీకు నవ్వొస్తున్నా ఇది నిజమే. విమానాలలో పెరుగు ప్యాకెట్లు, సూపులు, సాస్‌లు, పీనట్ బటర్ వంటివి ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లడానికి వీలు లేదు. నిజానికి కొన్ని ఎయిర్ లైన్స్ వారు వీటిని పూర్తిగా నిషేధించారు. మరికొందరు చాలా తక్కువ పరిమాణంలో అంటే 100ml కంటే తక్కువ పరిమాణంలో చిన్న చిన్న డబ్బాలలో మాత్రమే వీటిని అనుమతిస్తారు. అది కూడా కచ్చితంగా చెప్పలేము. కొన్నిసార్లు ఈ వస్తువులను సెక్యూరిటీ వారే ఆపేసి బయటికి పంపేసే అవకాశం ఉంది.
పండ్లు, కూరగాయలు కూడా
మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి పండ్లు, కూరగాయలే. కానీ విమానంలో మాత్రం పండ్ల బుట్టలతో, కూరగాయలతో ఎక్కుతాం అంటే కుదరదు. ముఖ్యంగా కొన్ని రకాల దేశాలకు చెందిన ఎయిర్ లైన్స్ పండ్లను, కూరగాయలను వేరే దేశం నుంచి తమ దేశానికి తెచ్చేందుకు ఒప్పుకోవు. దీనికి కారణం తెగుళ్లు, కొన్ని రకాల వ్యాధులు వాటితో పాటు వచ్చే అవకాశం ఉందని అనుమానం. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకెళ్లడానికి చాలా ఎయిర్ లైన్స్ కంపెనీలు కొన్ని దేశాలు నిషేదించాయి.
ఘాటైన వాసన వచ్చే ఆహారాలు అంటే వెల్లుల్లి వంటివి కూడా మీ హ్యాండ్ బ్యాగుల్లో లేదా వెల్లుల్లితో చేసిన వంటకాలు మీ దగ్గర ఉండకూడదు. విమానయాన సంస్థలు ఈ విషయాన్ని స్పష్టంగా ముందే చెబుతాయి. ఇతర ప్రయాణికులకు ఆ వాసన వల్ల అలెర్జీ కలగవచ్చు. లేదా అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి ఇలాంటి అధిక వాసన వేసే ఆహారాలను కూడా మీతో ఉంచుకోకూడదు.
పాలు, మాంసం
పాల ఉత్పత్తులు, వండిన మాంసాలు, సముద్రపు ఆహారాలు వంటివి మీ లగేజీలో ఉండకూడదు. అవి వండినవైనా, వండనివి అయినా లగేజీలో ఉండకూడదు. ఎందుకంటే ఇది గంటలు గడుస్తున్న కొద్ది త్వరగా పాడైపోతాయి. ఇలా పాడవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా లేదా వైరస్లు చేరవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి వీటిని విమానంలోకి అనుమతించరు. ఇది అక్కడున్న వాతావరణాన్ని దుర్వాసనతో నింపేస్తాయి. అందుకోసమే విమానం ఎక్కువేముందు ఇలాంటి వస్తువులు ఏవి లేకుండా చూసుకోవాలి.
ఏవైనా తినే పదార్థాలు లేదా పచ్చళ్ళు లాంటివి తీసుకెళ్లాలి అనుకుంటే వాటిని పూర్తిగా ప్యాక్ చేయాలి .ఓపెన్ ప్యాకేజీలు లేదా లీకేజీ ప్రమాదం ఉన్నట్టు గమనిస్తే విమానాశ్రయ సిబ్బంది వాటిని తీసి పక్కన పెట్టేస్తారు. పూర్తిగా సీల్ చేసిన వాటిని మాత్రమే పంపిస్తారు. స్నాక్స్ వంటివి తీసుకువెళ్లాలనుకుంటే వాటిని ప్లాస్టిక్ కవర్లలో పూర్తిగా సీల్ చేసి ఉంచండి. అప్పుడే మీరు తీసుకెళ్లగలరు.