వర్షాకాలం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పండ్లు, కూరగాయలపై ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. గాలిలో తేమ ఫంగస్ పెరుగుదలకు అనువైన పరిస్థితిగా మారుతుంది. ఇది తాజా ఉత్పత్తులను వేగంగా పాడు చేస్తుంది.  

pexels

By Bandaru Satyaprasad
Aug 05, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో పండ్లు, కూరగాయలకు ఫంగస్ పట్టకుండా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలు  

pexels

సరైన నిల్వ - పండ్లు, కూరగాయల సరైన నిల్వ ఫంగస్ నివారణలో కీలకమైన అంశం. గాలి చొరబడని కంటైనర్లలో వీటిని నిల్వ చేయండి. ఆకుకూరలు, హెర్బ్స్ ను పేపర్ టవల్ తో చుట్టి ఆపై రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. పండ్లు, కూరగాయలను ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయవద్దు.   

pexels

రెగ్యులర్ క్లీనింగ్-  రిఫ్రిజిరేటర్ ను రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండండి. ఫ్రిడ్జ్ లో పడిన ఆహారాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. మీ రిఫ్రిజిరేటర్‌ను వారానికి ఒకసారైనా గోరువెచ్చని నీటిలో వెనిగర్, బేకింగ్ సోడా వేసి శుభ్రం చేయండి.   

pexels

ఉష్ణోగ్రత నియంత్రణ -  వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు తాజాగా ఉండేందుకు సరైన ఉష్ణోగ్రతను నిర్వహించాలి. రిఫ్రిజిరేటర్‌ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ద్వారా ఫంగస్ పెరుగుదల నివారించవచ్చు. కిచెన్ లో సరైన వెంటిలేషన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఉపయోగించండి.   

pexels

ట్రెడిషనల్ సంరక్షణ పద్ధతులు- సంప్రదాయ పద్ధతులతో పండ్లు, కూరగాయలకు ఫంగస్‌ పట్టకుండా చేయవచ్చు.  తేమ శాతాన్ని తగ్గించడానికి వర్షాలు ప్రారంభానికి ముందు సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, పిండి పదార్థాలను ఎండలో ఆరబెట్టండి. వీటికి ఎండిన వేప ఆకులు, బే ఆకులు, పసుపు, వెల్లుల్లి, లవంగాలు, ఎండు మిర్చి జోడించవచ్చు.  

pexels

గాలి చొరబడని కంటైనర్లు -  చక్కెర, ఉప్పు, చిరుతిళ్లను గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయండి. ఇవి తేమను పీల్చకుండా నిరోధిస్తుంది. గాజు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన కంటైనర్లు ఉత్తమమైనవి. బిస్కెట్లు, స్నాక్స్ నిల్వ చేసేటప్పుడు కంటైనర్‌ను బ్రౌన్ పేపర్‌తో చుట్టండి.  

pexels

ఫ్రీజింగ్ - ఫ్రిడ్జ్ ఫంగస్, కీటకాల గుడ్లను నిర్మూలిస్తుంది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు కొన్న తర్వాత ఒకటి లేదా రెండు రోజులు వాటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయండి. ఇది వాటిని ఎక్కువ కాలం తాజాగా, ఫంగస్ దాడి నుండి సురక్షితంగా ఉంచుతుంది.  

pexels

తేమ నియంత్రణ -  పండ్లు, కూరగాయలను నిల్వ చేయడానికి ముందు వాటిని పొడిగా ఉండేలా చూసుకోండి. కూరగాయలను కడగడం, ఎండబెట్టడం, పేపర్ తో చుట్టడం ఫ్రిజ్‌లో ఉంచడం చేయండి.  మసాలా పొడులు, పిండి, గింజల వాడేటపప్పుడు ఎల్లప్పుడూ పొడి చెంచాను ఉపయోగించండి. 

మిల్లెట్స్‌ తింటే ఏమవుతుంది...? వీటిని తెలుసుకోండి

image credit to unsplash