Dark Legs: కాళ్ళపై నలుపు పోవాలంటే ఇలా చెయ్యండి!
Dark Legs Remedy: కాళ్లపై ఉండే నలుపు ఛాయాను వదిలించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తుంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఈ సమస్యను ఇంటి చిట్కా ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు.
కాళ్లపై ఉండే నల్లటి నల్లటి ఛాయా కారణంగా చాలా మంది తరచుగా ఇబ్బంది పడుతుంటారు. మరీ కాళ్లపై ఉండే నలుపును ఎలా తొలిగించుకోవాలి. ఎలాంటి పద్దతులను అనుసరించడం ద్వారా నలుపు సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది పాదాలపై నలుపు ఛాయా (Black Spots On Legs)ను తొలిగించడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ పరిష్కారాలు పని చేయవు. ఈ సమస్యను అధిగమించడానికి, మరి ఈ సమస్యను తగ్గించుకోవడానికి సులభమైన ఇంటి చూద్దాం. వీటితో మీ సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు. పాదాలపై ఉన్న నల్ల మచ్చలను ఎలా పోగొట్టుకోవాలో ఈ కథనం (Black Feet Remedy) ద్వారా తెలుసుకుందాం.
కాళ్ళపై నలుపును ఎలా శుభ్రం చేయాలి?
బేకింగ్ సోడా, ఉప్పు, నీరు, అలోవెరా జెల్‌తో కాళ్ళపై ఉండే బ్లాక్ హెడ్స్‌ను వదిలించుకోవచ్చు.
ఒక బకెట్ తీసుకుని అందులో సగం నీళ్లు పోసి వాటిలో అలోవెరా జెల్, బేకింగ్ సోడా, ఉప్పు వేయాలి.
ఇప్పుడు మీ పాదాలను ఆ నీటిలో కొంతసేపు ముంచండి.
పాదాలను బాగా స్క్రబ్ చేసిన తర్వాత బకెట్ లోంచి తీసి శుభ్రం చేసుకోవాలి.
ఇప్పుడు మీ పాదాలను టవల్‌తో బాగా శుభ్రం చేసి, ఆపై మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.
ఈ హోం రెమెడీతో కాళ్లపై నల్ల ఛాయ పోగొట్టడమే కాకుండా మృత కణాలను కూడా తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. కానీ బేకింగ్ సోడా మీ పాదాలపై దద్దుర్లు కలిగిస్తుంది. కాబట్టి మీ పాదాలను ఎక్కువసేపు నీటిలో ముంచకండి. అలాగే ఈ రెసిపీ వల్ల మీకు ఎలాంటి సమస్య వచ్చినా లేదా మీ పాదాలపై పుండ్లు ఉన్నట్లయితే ఈ నీటిని ఉపయోగించకండి, అది సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
(గమనిక : ఈ వ్యాసంలో అందించబడిన సలహా సాధారణమైనది మరియు అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే. ఇది నిపుణుల అభిప్రాయం కాదు. కాబట్టి ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి)
సంబంధిత కథనం