tips for small bathroom: బాత్రూం ఇరుగ్గా ఉందా? ఈ మార్పులు చేయండి
tips for small bathroom: బాత్రూం చిన్నగా ఉంటే దాన్ని మెయింటెన్ చేయడం కాస్త కష్టమే. చిన్న వస్తువులు పెట్టాలన్నా కష్టమే. ఈ చిట్కాలు పాటిస్తే అలంకరణతో పాటూ స్థలం కూడా మిగులుతుంది.
బాత్రూం పెద్దగా కనిపించేలా చేసే అలంకరణ మార్గాలు (Unsplash)
చిన్నగా ఉన్న బాత్రూం అందంగా అలంకరించడం కష్టమే. కానీ కాస్త సృజనాత్మకత, కొన్ని చిట్కాలు పాటిస్తే స్థలం ఎక్కువగా కనిపించేలా చేయొచ్చు. స్టోరేజీ లో మార్పులు, సరైన గోడల రంగులు వాడితే చాలా సులువు. ఉపయోగకరంగా, అందంగా కనిపిస్తుంది.
ఈ మార్పులు చేయండి:
- లేత రంగులు: బాత్రూంలో ఎప్పుడూ లేత రంగుల్నే వాడాలి. టైల్స్, గోడలు, వాష్‌బేసిన్ లాంటివన్నీ లేత రంగులోనే ఎంచుకోవాలి. దీనివల్ల స్థలం పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది.
- అద్దాలు: ఒక పెద్ద అద్దం లేదా అక్కడక్కడా చిన్న అద్దాలు పెట్టడం వల్ల దాన్నుంచి రిఫ్లెక్ట్ అయ్యే వెలుతురు వల్ల స్థలం పెద్దదనే భావన కలుగుతుంది. అలంకరణ వస్తువులాగా కూడా ఉంటుంది.
- స్టోరేజీ: ఫ్లూర్ మీద స్టోరేజీ యూనిట్ పెట్టడం కన్నా గోడలకు అటాచ్ చేసుకోగల ఆర్గనైజర్లు వాడితే కింద ఇరుకుగా అనిపించదు.
- చిన్న సైజు: వాష్ బేసిన్, షవర్ కార్నర్ చిన్న సైజువి ఎంచుకోవాలి. ఒక మూలలో ఉండేలా చూసుకోవాలి. మూలలో ఉన్న స్థలం వాడుకోవడంతో పాటూ, బాత్రూం పెద్దగా కనిపిస్తుంది.
- షవర్ కర్టెయిన్లు: షవర్ డూర్ కోసం ముదురు రంగు కన్నా లేత రంగు కర్టెయిన్లు ఎంచుకోండి. అవి గదిని భాగాలు చేసినట్లు కొట్టొచ్చినట్లు కనిపించకుండా చేస్తాయి. కళ్లకు స్థలం పెద్దదనే భావనే వస్తుంది.
- షెల్ఫులు: బాత్రూంలో ఉండే షెల్ఫులకు కబోర్డ్ చేయించకపోవడమే మంచిది. టవెళ్లు, సబ్బులు, షాంపూలు పెట్టుకోవచ్చు. అలంకరణ వస్తువులున్నా పెట్టుకోవచ్చు. రోజూవారీ వస్తువులు సులభంగా తీసుకోవచ్చు కూడా.
- లైటింగ్: బాత్రూంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ప్రొఫైల్ లైటింగ్, ఓవర్ హెడ్ లైటింగ్, టాస్క్ లైటింగ్ వల్ల గది లుక్ మారిపోతుంది.
- అలంకరణ: అందంగా కనిపించాలని అనవసరమైన వస్తువులు పెట్టొద్దు. అవసరమైన వస్తువులే అందంగా ఉండేలా చూసుకోవాలి. అంటే సోప్ హోల్డర్లు, అందంగా ఉన్న ట్రే, చిన్న మొక్క.. ఇవి చాలు.
- హిడెన్ స్టోరేజీ: పెద్ద అద్దాలు పెట్టుకుంటే వాటిని ఒక తలుపు లాగా తీయించేలా చేసుకుంటే దాని వెనకాల కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు. ఇలా ఇంకేమైనా మార్గాలున్నాయేమో చూడండి.
వీటివల్ల చిన్న బాత్రూం పెద్దగా కనిపించేలా చేయడమే కాకుండా, అంగుళం స్థలాన్ని కూడా ఉపయోగకరంగా మార్చేయొచ్చు.