Citroen Ami | ఆఫీసుకు వెళ్లేందుకు, బీచ్‌లో విహరించేందుకు సిట్రోయేన్ మైక్రోకార్!-citroen ami the microcar creates buzz around know price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Citroen Ami | ఆఫీసుకు వెళ్లేందుకు, బీచ్‌లో విహరించేందుకు సిట్రోయేన్ మైక్రోకార్!

Citroen Ami | ఆఫీసుకు వెళ్లేందుకు, బీచ్‌లో విహరించేందుకు సిట్రోయేన్ మైక్రోకార్!

HT Telugu Desk HT Telugu
Jun 20, 2022 11:25 AM IST

సిట్రోయేన్ ఆవిష్కరించిన ఒక బగ్గీ లాంటి మైక్రోకార్ ఇప్పుడు యూరోప్ దేశాలలో విశేష ప్రజాదరణ చూరగొంటుంది. ఆఫీసులకు వెళ్లేవారు దీనిని ఉపయోగిస్తున్నారు. దీనితో కేవలం వారికి నెలకు 20 పౌండ్లు మాత్రమే ఖర్చు అవుతుందట. ఈ మైక్రోకార్ పూర్తి విశేషాలు మీకోసం.

<p>Citroen Ami</p>
Citroen Ami

ఇటీవల కాలంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగింది. వినియోగదారులు ఖరీదైన కార్లపైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్న సందర్భంలో ఒక చిన్న కార్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయేన్ గతేడాది Citroen Ami పేరుతో ఒక మైక్రోకారును ఆవిష్కరించింది. చిన్న బగ్గీ బండిలా ఉండే ఈ కార్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా

ఆఫీసులకు వెళ్లాలనుకునే వారికి ఈ కార్ ఎంతగానో ప్రయోజకరంగా మారింది. నెలకు కేవలం 20 పౌండ్లు మాత్రమే ఖర్చు అవుతుందట. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1900. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. ఈ క్రమంలో అమీ క్వాడ్రిసైకిల్ మైక్రోకార్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఇప్పుడు ఈ బగ్గీ కార్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది.

వినియోగదారుల చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని సిట్రోయేన్ మరికొన్ని అమీ కార్లను సిద్ధం చేసింది. 8 ఆగస్టు 2022 నుంచి ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో వివిధ వెర్షన్లను కూడా అందుబాటులో ఉంచనుంది.

సిట్రోయేన్ అమీ మైక్రోకార్ స్పెసిఫికేషన్లు

ఈ కారును 2CV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. డిజైన్ పరంగా బోల్డ్-కలర్ ప్లాస్టిక్ బాడీవర్క్ ఉండి తేలికగా ఉంటుంది. దీని రూఫ్ ఆప్షనల్ గా ఇస్తున్నారు. ఈ ఆల్-ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ బూట్ లేదా బానెట్ లేకుండా కేవలం 2.4 మీటర్ల పొడవు,1.4 మీటర్ల వెడల్పుతో వస్తుంది.

సిట్రోయేన్ Amiలో అన్ని వెర్షన్లు 6kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి, ఇది 5.5kWh బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. ఒక్క ఛార్జ్ తో సుమారు 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు. ఫ్రాన్స్ దేశంలో దీని ధర 7,695 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7 లక్షలు.

మన భారతదేశంలో ఇంత ఖర్చు చేసి దీనిని ఎవరూ కూడా రోజూవారీ అవసరాల కొనుగోలు చేయలేరు. అయితే ఈ మైక్రోకార్ యిర్‌లైన్ క్యారీ-ఆన్ కోసం, బీచ్ లు లేదా పార్కుల్లో విహరించడానికి లేదా పర్యాటక అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం