CBSE 10th, 12th Board Exams 2023 : ప్రైవేట్ అభ్యర్థుల కోసం నేటినుంచే రిజిస్ట్రేషన్లు-cbse 10th 12th board exams 2023 registrations to begin today for private candidates ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Cbse 10th, 12th Board Exams 2023 Registrations To Begin Today For Private Candidates

CBSE 10th, 12th Board Exams 2023 : ప్రైవేట్ అభ్యర్థుల కోసం నేటినుంచే రిజిస్ట్రేషన్లు

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 17, 2022 11:17 AM IST

CBSE 10వ, 12వ తరగతి పరీక్షలు 2023 కోసం విద్యార్థులు cbse.gov.inలోని అధికారిక వెబ్‌సైట్ ద్వారా 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

CBSE 10వ, 12వ తరగతి పరీక్షల కోసం రిజిస్ట్రేషన్లు
CBSE 10వ, 12వ తరగతి పరీక్షల కోసం రిజిస్ట్రేషన్లు

CBSE 10th, 12th Board Exams 2023 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CBSE ప్రైవేట్ విద్యార్థుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు అనగా సెప్టెంబర్ 17, 2022న ప్రారంభించనుంది. CBSE త్వరలో cbse.gov.inలో రిజిస్ట్రేషన్ లింక్‌ను యాక్టివేట్ చేయనుంది. cbse.gov.inలోని అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకోవచ్చు.

CBSE 10th, 12th Board Exams 2023 ముఖ్యమైన తేదీలు

* రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 17

* దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30

* దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (ఆలస్య రుసుముతో): అక్టోబర్ 7

CBSE 10th, 12th Board Exams 2023 డైరెక్ట్ లింక్‌లు

* పదో తరగతి పరీక్ష - 2023 ప్రైవేట్ విద్యార్థుల కోసం

CBSE అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. 10, 12వ తరగతి ప్రైవేట్ పరీక్ష 2023 కోసం దరఖాస్తు, ఫారమ్‌లను సమర్పించగల అభ్యర్థుల జాబితా:

* CBSE 10వ, 12వ బోర్డు పరీక్ష ఫలితాలలో 'ఎసెన్షియల్ రిపీట్'గా ప్రకటించిన విద్యార్థులు (సెషన్ 2021-2022).

* CBSE 10వ, 12వ బోర్డు పరీక్ష ఫలితాల్లో (ప్రధాన, మొదటి అవకాశం) 'కంపార్ట్‌మెంట్ కేటగిరీ'లో ఉన్న విద్యార్థులు (సెషన్ 2021-2022).

* 2017, 2018, 2019, 2020, 2021లో జరిగిన CBSE 10, 12 బోర్డు పరీక్షల్లో 'ఫెయిల్ లేదా ఎసెన్షియల్ రిపీట్' అయిన విద్యార్థులు (సెషన్ 2021-2022).

* CBSE 10వ, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ 2022లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో తమ పనితీరును మెరుగుపరచుకోవాలనుకుంటున్నవారు.

* CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 2022 అదనపు సబ్జెక్ట్‌లో హాజరు కావాలనుకునే వారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్