Cargo pants : పాత కాలం కార్గో ప్యాంట్లు మళ్లీ ట్రెండింగ్-cargo pants are trending in menswear ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cargo Pants : పాత కాలం కార్గో ప్యాంట్లు మళ్లీ ట్రెండింగ్

Cargo pants : పాత కాలం కార్గో ప్యాంట్లు మళ్లీ ట్రెండింగ్

Koutik Pranaya Sree HT Telugu
Apr 25, 2023 06:11 PM IST

Cargo pants : కార్గో ప్యాంట్లు మళ్లీ ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయాయి. ప్రతి అబ్బాయి వార్డ్‌రోబ్ లో ఈ ప్యాంట్లు ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.

కార్గో ప్యాంట్లు
కార్గో ప్యాంట్లు (Photo by Samson Katt on Pexels)

ఫ్యాషన్‌తో పాటే సౌకర్యం కూడా కావాలనుకునే అబ్బాయి మీరైతే మీకిీ కార్గో ప్యాంట్లు సరిపోతాయి. మీ లుక్ ని స్టైలిష్ గా, ట్రెండీగా మారుస్తాయి. కార్గో ట్రౌజర్లు ఇంతకముందులా కాకుండా.. లూజ్ ఫిట్టింగ్‌లో, స్లిమ్ ఫిట్‌లో ఇలా ప్రతి రకంలో వచ్చేశాయి. రోజూవారీ క్యాజువల్ లుక్ కోసం ఇవి చక్కని ఎంపిక.

వీటికుండే మరో ప్రత్యేకత చాలా జేబులు ఉండటం. “ఈ ప్యాంట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 60 శాతం పెరిగింది. త్వరలోనే ఇవి జీన్స్ ప్యాంట్లకి ప్రత్యామ్నాయంగా మారిపోతా”యని HT లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్స్‌వేర్ బ్రాండ్ పవర్ లుక్ సంస్థ కో ఫౌండర్ అమర్ పవార్ అన్నారు. దానికి కారణం చూడటానికి ఈ ప్యాంట్లు సౌకర్యవంతంగా, ట్రెండీగా అనిపించడమే.

జేబులెక్కువగా ఉండటం వల్ల..:

ట్రెక్కింగ్ కి, టూర్లకి వెళ్లినపుడు, ఆఫీసుకి ఇలా ప్రతి సందర్భానికి ఇవి వేసుకోవచ్చు. పాతకాలంలో పని ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా వాడేవారు. ఎక్కువగా జేబులుండటం వల్ల పనికి సంబంధించిన కొన్ని వస్తువులు పెట్టుకోవడం సులభంగా ఉంటుందని వీటిని వాడేవారట.

బ్రిటీష్ సైన్యంలో.. :

కార్గో ప్యాంట్లు కొత్తవి కాదు. చాలా రోజుల కిందటి ఫ్యాషన్. కానీ ఇప్పుడు వస్తున్న డిజైన్లు మాత్రం కొత్తవి అని ఫ్యాషన్ నిపుణుల మాట. బ్రిటీష్ సైన్యం వాటిని 1930ల్లో తయారు చేసిందట. ఎక్కువ మన్నిక ఉండటంతో పాటు.. మ్యాపులు, చిన్న రవాణా సామగ్రి, పరికరాలు ఈ ప్యాంటు జేబుల్లో పెట్టుకునే వారు. 1990 ల్లో వీటిని యువత కూడా వేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం సెలెబ్రిటీ ఫ్యాషన్ కూడా అయిపోయాయివి.

1980 లో వీటిని కాస్త ఉపయోగించినా, వాటి లుక్ అపుడంత ఫార్మల్ గా ఉండేది కాదు. మరీ వదులుగా, పెద్దగా ఉండేవి. కొన్ని షార్ట్స్ లాగా కూడా ఉండేవి. ఇప్పుడు మాత్రం వాటి రూపం బాగుంది. పెద్ద పెద్ద బ్రాండ్ల సమ్మర్ ఫ్యాషన్ షోలలో వీటిని ప్రదర్శించారు. ఇంకేం. ఆలస్యం చేయకుండా కార్గో ప్యాంట్ మీరు కూడా తెచ్చేసుకోండి.

వేటితో వేసుకోవచ్చంటే.. :

కార్గో ప్యాంట్లలో వస్తున్న స్లిమ్ ఫిట్ ప్యాంట్లు చీనోస్ లాగే వేసుకోవచ్చు. క్యాజువల్ టీషర్ట్, స్నీకర్స్ తో ఈ ప్యాంట్లు జత చేసుకోవచ్చు. మిలిటరీ ఆకుపచ్చ రంగులో ఉండే ప్యాంట్లను లేదా నలుపు రంగులో ఉండే ప్యాంట్లను ఎంచుకోండి. ట్రెండీ లుక్ ఉంటుంది. వీటి మీదకి ఓవర్ సైజ్డ్ టీ షర్టులు వేసి చూడండి. ఇంకాస్త స్టైలిష్ గా కనిపిస్తారు.

WhatsApp channel

టాపిక్