Leftover idli: మిగిలిన ఇడ్లీలతో నోరూరించే చిల్లీ ఇడ్లీ, క్రిస్పీ చాట్ చేసేయండి-best snacks with leftover idli chilli idli and crispy idli chat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leftover Idli: మిగిలిన ఇడ్లీలతో నోరూరించే చిల్లీ ఇడ్లీ, క్రిస్పీ చాట్ చేసేయండి

Leftover idli: మిగిలిన ఇడ్లీలతో నోరూరించే చిల్లీ ఇడ్లీ, క్రిస్పీ చాట్ చేసేయండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 15, 2024 03:30 PM IST

Leftover idli: ఇంట్లో ప్రొద్దున మిగిలిపోయిన ఇడ్లీలుంటే సాయంత్రం పూట మంచి స్నాక్స్ చేసుకోవచ్చు. క్రిస్పీ ఇడ్లీ చాట్, చిల్లీ ఇడ్లీ చేశారంటే అదిరిపోతాయి. వాటి రెసిపీలు చూసేయండి.

మిగిలిన ఇడ్లీలతో స్నాక్స్
మిగిలిన ఇడ్లీలతో స్నాక్స్

ఉదయం మిగిలిపోయిన ఇడ్లీలుంటే వాటితో ఏం చేయాలో తెలియట్లేదా? ఇలా బెస్ట్ స్నాక్స్ చేసేయండి. ఫ్రైడ్ ఇడ్లీ చాట్, చిల్లీ ఇడ్లీ రెసిపీలు పెద్ద వాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీలు చూసేయండి.

ఫ్రైడ్ ఇడ్లీ చాట్:

ఫ్రైడ్ ఇడ్లీ చాట్
ఫ్రైడ్ ఇడ్లీ చాట్ (Pinterest)

కావల్సినవి:

10-12 ఇడ్లీలు

ఫ్రై చేయడానికి సరిపడా నూనె

1 టీస్పూన్ కారం పొడి

1 టీస్పూన్ బ్లాక్ సాల్ట్

1 టీస్పూన్ చాట్ మసాలా

1 టీస్పూన్ జీలకర్ర పొడి

1/2 టీస్పూన్ శాండ్విచ్ మసాలా

1/2 టీస్పూన్ ఆమ్ చూర్ పొడి

4 టీస్పూన్ల బటర్

2 టీస్పూన్లు తరిగిన తాజా కొత్తిమీర

2 టీస్పూన్ల నిమ్మరసం

2 చెంచాల తియ్యటి పెరుగు

1 చెంచా చింతపండు చట్నీ

గుప్పెడు వేయించిన పల్లీలు

గుప్పెడు దానిమ్మ గింజలు

తయారీ విధానం:

1. ముందుగా ఇడ్లీలను ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి.

2. కడాయిలో తగినంత నూనె వేడి చేయాలి. ఇడ్లీ ముక్కలను బంగారు వర్ణంలోకి అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి.

3. ఒక వెడల్పాటి గిన్నెలో కారం, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, శాండ్ విచ్ మసాలా, ఆమ్ చూర్ పొడి, బటర్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. నిమ్మరసం చల్లి బాగా కలిసే వరకు కలపాలి.

3. సర్వింగ్ ప్లేట్ లోకి ఇడ్లీ ముక్కలు తీసుకోవాలి. తియ్యటి పెరుగు, ఖర్జూరం, చింతపండు చట్నీ గ్రీన్ చట్నీ, సేవ్, వేరుశెనగ, తాజా దానిమ్మ గింజలు, కొత్తిమీర తరుగు, మసాలా పొడి వేసి వెంటనే సర్వ్ చేయండి.

చిల్లీ ఇడ్లీ:

చిల్లీ ఇడ్లీ
చిల్లీ ఇడ్లీ (Pinterest)

కావలసినవి:

నూనె 2 టేబుల్ స్పూన్లు

వెల్లుల్లి 7-8 రెబ్బలు (తరిగినవి)

అల్లం 1 అంగుళం ముక్క (తరిగినవి)

పచ్చిమిర్చి 5-6 చీలికలు

క్యాప్సికమ్ 2 మీడియం సైజ్ (తరిగినవి)

ఉల్లికాడలు 1/2 కప్పు (తరిగినవి)

పంచదార 1 టీస్పూన్

రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు

సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు పావు చెంచా

మిరియాల పొడి పావు చెంచా

కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్

చిల్లీ ఇడ్లీ తయారీ విధానం:

1. బాణలిలో నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించాలి.

2. తర్వాత క్యాప్సికమ్, ఉల్లికాడల ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి.

3. అందులో పంచదార వేసి మరో నిమిషం వేయించి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, రుచికి సరిపడా ఉప్పు, నల్ల మిరియాలపొడి వేసి మరో 1-2 నిముషాలు వేయించాలి.

4. ఇప్పుడు కార్న్ ఫ్లోర్, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకుని మరో నిమిషం ఉడికి చిక్కబడే దాకా ఆగాలి.

5. ముందుగానే ఒక ప్యాన్ లో చెంచా నూనె వేసుకుని ఇడ్లీలు చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలి. దాంతో అవి క్రిస్పీగా అవుతాయి.

5. చిక్కబడ్డ సాస్‌లో అలా క్రిస్పీగా వేయించిన ఇడ్లీల ముక్కలు వేసుకొని కలపాలి. అంతే.. క్రిస్పీ చిల్లీ ఇడ్లీ రెడి.

Whats_app_banner