Teeth Brushing | అలవాటులేని చేతితో పళ్లుతోమితే.. అన్ని ప్రయోజనాలా?
Teeth Brushing | రోజూ లేవగానే పళ్లు తోముకోనిదే డే స్టార్ట్ కాదు. ప్రతి ఒక్కరూ రోజులో మొదటిగా చేసే దినచర్య కూడా ఇదే. అలవాటు ఉన్న చేతితోనే బ్రష్ చేసి.. రోజు ప్రారంభించడం పాత పద్దతి. ఇప్పుడు మీకు అలవాటు లేని చేతితో బ్రష్ చేయడం నేర్చుకోండి. ఎందుకు కొత్తగా ప్రయత్నిచడం. ఇదే కంఫర్ట్‌గా ఉంది అనుకుంటున్నారా? అసలు ఎందుకు అలవాటు లేని చేతితో బ్రష్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చదవాల్సిందే.
మనిషి రోజూ బ్రష్ చేయడం కామన్. హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్లు రోజుకు రెండు సార్లు పళ్లు తోముకుంటారు. డాక్టర్లు కూడా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయమని సూచిస్తారు. చాలా మంది కుడి చేతితోనే టీత్ బ్రష్ చేస్తారు. కొందరు ఎడమ చేతితో బ్రష్ చేస్తారు. మనకు కూడా ఇది అలవాటు అయినదే. కానీ ఎప్పుడైనా అలవాటు లేని చేతితో బ్రష్ చేశారా? ఎలా అంటే కుడిచేతితో పళ్లు తోముకునే అలవాటు ఉన్నవారు.. ఎడమచేతితో.. ఎడమచేతితో తోముకునే అలవాటు ఉన్నవాళ్లు కుడి చేతితో పళ్లు తోముకున్నారా?
మెదడు అలర్ట్ అవుతుంది..
అయితే ఇప్పుడు ట్రై చేయండి. అలవాటు లేని చేతితో బ్రష్ చేయడం వల్ల మనలో సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తారని చెబుతున్నారు. అది ఎలా అంటే.. ఉదయాన్నే అలవాటు లేని చేతితో బ్రష్ చేయడం వల్ల.. మత్తులోనే ఉన్న మెదడుకు కాస్త ఒత్తిడి ఇచ్చినట్లు అవుతుంది. అలా బ్రెయిన్ త్వరగా యాక్టివ్ అవుతుంది అనమాట. పైగా అలవాటు లేని చేతితో పళ్లు తోముకోవడం వల్ల మనలో క్రియేటివిటి కూడా పెరుగుతుందని చెప్తున్నారు.
లేజీ డేని యాక్టివ్ గా..
అలవాటులేని చేతితో బ్రష్ చేసి.. లేజీ డేని.. కాస్త యాక్టివ్‌గా మార్చుకోండి. యాక్టివ్‌గా రోజును ప్రారంభిస్తే.. డే అంతా హ్యాపీగా గడిచిపోతుంది. పని చేస్తున్నా త్వరగా అలసిపోకుండా ఉంటాం. కాబట్టి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. రోజును భిన్నంగా మార్చుకోండి.
సంబంధిత కథనం