Bajaj CT125X। బజాజ్ నుంచి బడ్జెట్ బైక్, ధర కేవలం రూ.71 వేలు, మైలేజ్ ఎంతో తెలుసా?-bajaj ct125x affordable bike launched at 71 354 check mileage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bajaj Ct125x। బజాజ్ నుంచి బడ్జెట్ బైక్, ధర కేవలం రూ.71 వేలు, మైలేజ్ ఎంతో తెలుసా?

Bajaj CT125X। బజాజ్ నుంచి బడ్జెట్ బైక్, ధర కేవలం రూ.71 వేలు, మైలేజ్ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 02:52 PM IST

బజాజ్ నుంచి సరసమైన ధరలో బజాజ్ CT125X అనే మోటార్ సైకిల్ విడుదలైంది. దీని ధర, మైలేజ్ ఇతర వివరాలను తెలుసుకోండి.

Bajaj CT125X
Bajaj CT125X

దేశీయ పాపులర్ ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ తమ బ్రాండ్ నుంచి అత్యంత సరసమైన 125cc బైక్ Bajaj CT125Xను భారత మార్కెట్లో నిశబ్దంగా విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద ఈ బైక్ ధర రూ. 71,354/-. ఈ బైక్ చూడటానికి CT110X మోడల్ ను పోలి ఉంటుంది. అయితే సరికొత్త Bajaj CT125Xలో ప్రకాశవంతమైన రౌండ్ హెడ్‌లైట్‌ను ఇచ్చారు, హెడ్‌లైట్‌కు రక్షణగా గార్డ్ ఉంది. ఇక దీని అనుసంధానంగా పైన ఎల్‌ఈడీ స్ట్రిప్‌తో కూడిన చిన్న కౌల్ ఉంది. అలాగే ఇంజన్ క్రాష్ గార్డ్, వెనుక వైపున లగేజ్ ర్యాక్‌ని కూడా ఇచ్చారు.

రోజూవారీ అవసరాల కోసం, మైలేజ్ ఎక్కువ కోరుకునే వారికి ఈ బైక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గ్రీన్- బ్లాక్, రెడ్-బ్లాక్, బ్లూ-బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన డ్యుఎల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇంకా ఈ బైక్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, దీని ఇంజన్ కెపాసిటీ, ఇతర స్పెసిఫికేషన్లను ఇప్పుడు తెలుసుకుందాం.

Bajaj CT125X ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

బజాజ్ CT125Xలో 124.4cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 10bhp వద్ద 11Nm వద్ద టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి ఇంజన్ బజాజ్ డిస్కవర్ 125లోనూ ఉంటుంది.

ఇతర హార్డ్‌వేర్‌ అంశాలను పరిశీలిస్తే, ఈబైక్‌కు ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనకాల డ్యూయల్ గ్యాస్-ఛార్జ్డ్ రియర్ స్ప్రింగ్‌ షాక్ అబ్జర్బర్లను కలిగి ఉంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో ముందు చక్రానికి 240mm డిస్క్ బ్రేక్, వెనక చక్రానికి 130mm డ్రమ్‌ బ్రేక్ ఉంటుంది. కావాలనుకుంటే రెండు డ్రమ్ బ్రేకుల్లో పొందవచ్చు.

ఈ బైక్ లీటరుకు 65 కిమీ మైలేజ్ అందించగలదని నివేదికలు పేర్కొన్నాయి.

సరికొత్త బజాజ్ CT125X బైక్ భారత మార్కెట్లో హోండా షైన్, TVS రేడియన్, హీరో గ్లామర్, హోండా SP 125 వంటి బైక్ లకు పోటీగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్