Bajaj - Triumph | బజాజ్- ట్రయంఫ్ జాయింట్ వెంచర్.. బుల్లెట్ బండికి పోటీగా ఓ బైక్‌-bajaj triumph join hands to launch a new bike that rivals royal enfield ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bajaj - Triumph | బజాజ్- ట్రయంఫ్ జాయింట్ వెంచర్.. బుల్లెట్ బండికి పోటీగా ఓ బైక్‌

Bajaj - Triumph | బజాజ్- ట్రయంఫ్ జాయింట్ వెంచర్.. బుల్లెట్ బండికి పోటీగా ఓ బైక్‌

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 02:07 PM IST

బజాజ్ కంపెనీ అలాగే 1000 సిసి సామర్థ్యంతో ఖరీదైన బైక్స్ తయారు చేసే ట్రయంఫ్ కంపెనీ సంయుక్తంగా విభిన్నమైన శైలిలో ఒక బైక్ ను రూపొందిస్తున్నాయి. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌కు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Bajaj- Triumph
Bajaj- Triumph

మార్కెట్లో ఎన్ని రకాల బైక్‌లు వచ్చిన క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌కు ఉన్న క్రేజ్ కు ఏదీ సాటి రాదు. అయితే దేశీయంగా బజాజ్ కంపెనీ బైక్ మోడల్స్‌కు మంచి ఆదరణ ఉంది. అలాగే UKకు చెందిన ట్రయంఫ్ బ్రాండ్ ఖరీదైన బైక్‌లకు కూడా ఉన్నత వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు కొత్త వార్త ఏమిటంటే బజాజ్ కంపెనీ- ట్రయంఫ్ కంపెనీ రెండూ చేతులు కలిపాయి. ఇవి రెండూ కలిసి జాయింట్ వెంచర్లో భాగంగా ఒక సరసమైన కొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పోటీగా ఒక సరికొత్త మోటార్ సైకిల్ తీసుకురావడానికి కలిసి పనిచేస్తున్నాయి. బజాజ్- ట్రయంఫ్ సంయుక్తంగా విభిన్నమైన శైలిలో రూపొందించిన స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ తరహా మోటార్‌సైకిళ్లు ఇప్పటికే విదేశీ రహదారులపై పరీక్షిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

నివేదికల ప్రకారం ట్రయంఫ్- బజాజ్ సంయుక్తంగా రూపొందిస్తున్న రెండు బైక్ మోడళ్లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350 వంటి బైక్‌కు పోటీ ఇస్తుండగా, రెండవ బైక్ యెజ్డీ స్క్రాంబ్లర్ అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ బైక్‌లకు పోటీగా నిలుస్తాయని తెలుస్తోంది. జాయింట్ వెంచర్లో రాబోయే రెండు బైక్‌లు బోల్ట్-ఆన్ రియర్ సబ్‌ఫ్రేమ్‌లతో ఒకే ట్యూబ్యులర్ ఛాసిస్‌పై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ విధులు ముందు వైపున తలక్రిందులుగా ఉండే ఫోర్కులు, వెనుక వైపున మోనో-షాక్ సెటప్‌ను కలిగి ఉంటాయి.

డిజైన్ పరంగా.. సిగ్నేచర్ రౌండ్ హెడ్‌లైట్లు, ఇంజన్ అండర్ బెల్లీ క్రాష్ గార్డ్, టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్ , స్ల్పిట్-స్టైల్ సీట్లు కలిగి ఉంటుంది. అదనంగా డ్యూయల్-బ్యారెల్ బాక్సుతో కూడిన సింగిల్ ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్‌ను కూడా కలిగి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంజన్ కెపాసిటీ, ఇతర స్పెసిఫికేషన్లు

కొత్త బజాజ్-ట్రయంఫ్ మోటార్‌సైకిల్ 200-250cc సామర్థ్యం కలిగిన మోటార్‌ను పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, లీక్ అయిన మోటార్‌సైకిళ్ల చిత్రాలను పరిశీలిస్తే అవి 350-400సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కొత్త మోటార్‌సైకిల్ శ్రేణి బహుళ ఇంజన్ సైజులతో అందించవచ్చు.

అలాగే మరొక శ్రేణిలో సబ్-500cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఈ బైక్ బలమైన పనితీరును కలిగి ఉంటుంది. లిక్విడ్-కూలింగ్ సెటప్‌తో పాటు 4-వాల్వ్, DOHC లేఅవుట్‌ను ఉపయోగిస్తుంది. బజాజ్ అభివృద్ధి చేసిన ఇతర KTM మోడళ్లలో ఇలాంటి ఇంజన్‌ని మనం చూడవచ్చు.

బ్రాండ్ ద్వారా మరిన్ని వివరాలను ఇంకా పంచుకోనప్పటికీ, ఈ రెండు కొత్త బైక్‌లు సబ్-500cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి, ఇది బలమైన పనితీరును కలిగి ఉంటుంది. ఇంకా, ఈ కొత్త బైక్ లిక్విడ్-కూలింగ్ సెటప్‌తో పాటు 4-వాల్వ్, DOHC లేఅవుట్‌ను ఉపయోగిస్తుంది. బజాజ్ అభివృద్ధి చేసిన ఇతర KTM మోడళ్లలో ఇలాంటి ఇంజన్‌ని మనం చూస్తాము.

నివేదికల ప్రకారం ఈ బైక్‌లు 2023 మధ్య నాటికి తమ భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటి ధరలు కూడా రూ. 2-3 లక్షల వరకు ఉండవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్